మేటర్ సీరియస్... చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్!

ప్రధానంగా కనుమ రోజున మంచు మనోజ్.. నారావారి పల్లెకు వెళ్లడం దగ్గర నుంచి మరోసారి రచ్చ మొదలైందని అంటున్నారు.

Update: 2025-01-16 06:55 GMT

కొంతకాలంగా కాస్త సద్దుమణిగినట్లు కనిపించిన మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం సంక్రాంతి పండగ వేళ మరోసారి మొదలైనట్లు కనిపిస్తుంది. ప్రధానంగా కనుమ రోజున మంచు మనోజ్.. నారావారి పల్లెకు వెళ్లడం దగ్గర నుంచి మరోసారి రచ్చ మొదలైందని అంటున్నారు. మోహన్ బాబు విద్యాసంస్థల వద్దకు చేరిన వేళ విషయం పీక్స్ కి చేరిందని చెబుతున్నారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్ లో కనిపించారు మంచు మనోజ్.

అవును... మంచు ఫ్యామిలీలో మంటల వ్యవహారం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బుధవారం మంచు మనోజ్ నారావారి పల్లెకూ దురుద్దేశంతోనే వచ్చాడని.. అనంతరం మోహన్ బాబు విద్యాసంస్థల వద్దకు సుమారు 200 మందితో కలిసి వెళ్లాడని.. అయితే లోపలకు వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని మోహన్ బాబు తెలిపిన సంగతి తెలిసిందే.

అనంతరం.. కొంత ముందుకు వెళ్లి మోహన్ బాబు విద్యాసంస్థల్లోని డైరీ ఫారంలోని గేటును ఎగిరి దూకి లోపలికి వెళ్లాడని.. ఇది కచ్చితంగా కోర్టు దిక్కరణకు సంబంధించినదని.. అందువల్ల ఇతనిపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి, కోర్టుకు అప్పీలు చేస్తున్నట్లు మోహన్ బాబు తెలిపారు. అయితే... ఈ వ్యవహారంపై మంచు మనోజ్ తన వెర్షన్ వినిపించారు.

ఇందులో భాగంగా... తాను జనరేటర్లో చక్కెర వేయడం, ఫ్లెక్సీలు చెంపడం వంటి చిల్లర పనులు చేయనని.. తన నానమ్మ, తాతయ్యల సమాదులు చూసి వెళ్లాలని వచ్చానని అన్నారు. తాను యూనివర్శిటీలోకి వెళ్లకూడదని, తన గ్రాండ్ పేరెంట్స్ సమాధులు చూడటానికి వెళ్లవద్దని కోర్టు కండిషన్స్ లేవని.. అయినప్పటికీ తనను అడ్డుకున్నందుకు తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

బుధవారం రోజు ఆ విధంగా జరగ్గా... గురువారం ఉదయం మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మంచు మనోజ్.. బుధవారం మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద జరిగిన ఘటనపై పోలీసులతో చర్చలు జరిపి, అనంతరం తనను అడ్డుకోవడంపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

దీతో... మరోసారి మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగినట్లున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఇలా నిన్న మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేయగా.. నేడు మోహన్ బాబు స్కూల్స్ వద్ద జరిగిన ఘటనపై మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో... ఈ వ్యవహారానికి ముగింపు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News