షాకింగ్ న్యూస్... యూనివర్సిటీలో సమూహ కాల్పులు!

వివరాళ్లోకి వెళ్తే... ప్రాగ్‌ లోని చార్ల్స్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి తొలుత తన తండ్రిని చంపి ఆపై యూనివర్శిటీలో కాల్పులకు తెగబడినట్టు చెబుతున్నారు.

Update: 2023-12-22 04:27 GMT

యూనివర్శిటీలో తోటి విద్యార్థే తుపాకీ తెస్తే.. దుండగుడైన ఆ విద్యార్థి తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపితే.. యూనివర్శిటీ ప్రాంగణం అంతా రక్తశిక్తమైపోతే.. ఆ దారుణాన్ని తలచుకోవడమే కష్టం! కానీ అలాంటి పనికి పూనుకున్నాడు ప్రాగ్‌ లోని చార్ల్స్ యూనివర్సిటీలోని ఒక విద్యార్థి. ఈ కాల్పుల్లో సుమారు 15 మంది మృతి చెందగా.. 30మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు!

అవును... చెక్‌ రిపబ్లిక్‌ రాజధాని నగరమైన ప్రాగ్‌ లోని చార్ల్స్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి జరిపిన సమూహ కాల్పుల్లో 15 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడినట్లు చెక్‌ పోలీసులు తెలిపారు. యూనివర్శిటీలో విద్యార్థులపై కాల్పులకు పాల్పడిన అనంతరం ఆ విద్యార్థి కూడా ఈ ఘటనలో మృతి చెందాడని చెబుతున్నారు. నగరంలోని చెర్ల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆర్ట్స్ విభాగం వద్ద ఈ కాల్పులు జరిగాయి.

వివరాళ్లోకి వెళ్తే... ప్రాగ్‌ లోని చార్ల్స్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి తొలుత తన తండ్రిని చంపి ఆపై యూనివర్శిటీలో కాల్పులకు తెగబడినట్టు చెబుతున్నారు. తండ్రిని చంపిన అనంతరం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టిన సమయంలోనే... ప్రాగ్ నగరానికి చేరుకుని యూనివర్శిటీలోకి ఎంటరై ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీస్ చీఫ్ తెలిపారు.

దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల డేవిడ్ కొజాక్‌ గా గుర్తించినట్లు స్థానిక మీడియా నివేదించింది. వోండ్రాసెక్ తన ఇంటిలో జరిపిన శోధన ఆధారంగా డిసెంబర్ 15న ప్రేగ్‌ లో ఒక వ్యక్తిని, అతని రెండు నెలల కుమార్తెను హత్య చేయడంలో ఈ నిందితుడు అనుమానితుడని చెబుతున్నారు. అయితే నిందితుడు తనను తాను చంపుకున్నాడా.. లేక, అధికారులు జరిపిన కాల్పుల్లో చంపబడ్డాడా అనేది స్పష్టంగా తెలియలేదు.

ఈ విషయాలపై స్పందించిన పోలీస్ అధికారులు... రష్యాలో గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని తెలిపారు. దానిని స్ఫూర్తిగా తీసుకునే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.

కాగా... 1993లో ఇండిపెండెంట్ కంట్రీగా అవతరించిన తర్వాత చెక్ రిపబ్లిక్‌ లో జరిగిన అత్యంత దారుణ ఘటన ఇదే అని చెబుతుండటం గమనార్హం!

Tags:    

Similar News