కేరళను తాకనున్న రుతుపవనాలు... తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడంటే..?

ఈ ఎండలకు తోడు కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు మగ్గేసిన మామిడిపండులా ముగ్గిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి

Update: 2024-05-29 14:30 GMT

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు తోడు కరెంటు కోతలు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రజలు మగ్గేసిన మామిడిపండులా ముగ్గిపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు బయటకు వెళ్లాలంటే ఎన్నో సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ సమయంలో ఐఎండీ గుడ్ న్యూస్ తెలిపింది.

అవును... ఎండలు మందిపోతున్న వేళ చల్లని కబురు చెప్పింది ఐఎండీ. ఇందులో భాగంగా రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని తెలిపింది. ఈ క్రమంలో... మే 30న రుతుపవనాలు కేరళను తాకనున్నాయని ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ నరేశ్ కుమార్ తెలిపారు. అనంతరం నెమ్మదిగా నెమ్మదిగా ఉత్తరాది రాష్ట్రాలకి విస్తరిస్తాయన్నారు.

ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని తెలిపిన వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ నరేశ్ కుమార్... దేశంలో వాతావరణ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... దేశంలో ప్రస్తుతం ఎండలు మండిపోవడానికి గల కారణాలను వివరించారు.

ఈ ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైందని తెలిపిన ఆయన... ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశామని అన్నారు. పాకిస్తాన్ లోనూ 50 డిగ్రీల టెంపరేచ ర్ ఉండటంతో.. అటు నుంచి వీచే వేడిగాలుల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు.

ఇక దక్షిణాది రాష్ట్రాలు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాను ఈ రుతుపవనాలు ఎప్పుడు తాకనున్నాయనే విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా... కేరళను తాకిన ఐదు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకూ అవి విస్తరించనున్నాయని అన్నారు.

Tags:    

Similar News