.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

మోతీలాల్ పేరుతో రేవంత్ సర్కారుకు హరీశ్ రావు వార్నింగ్

విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకునే నేతలు.. తాము అధికారంలో ఉన్నప్పుడు అదే తీరును ప్రదర్శిస్తే

Update: 2024-06-30 13:30 GMT

విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకునే నేతలు.. తాము అధికారంలో ఉన్నప్పుడు అదే తీరును ప్రదర్శిస్తే.. అధికారం చేజారే అవకాశం ఉండదన్న చిన్న విషయాన్ని ఎలా మిస్ అవుతారన్నది ఒక పట్టాన అర్థం కాదు. తాజాగా ప్రతి విషయానికి రేవంత్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. తన మేనమామ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న వేళలో.. ఏళ్లు ఏళ్లు ఎవరెన్ని నిరసనలు. ఆందోళనలు చేసినా పట్టని హరీశ్ కు.. ఇప్పుడు ప్రతి అంశాన్ని భూతద్దంలో వేసి చూస్తున్నారు. దీంతో.. ఆయన ఏదైనా సీరియస్ అంశాన్ని ప్రస్తావించినా.. ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో.. న్యాయమైన అంశాలకు ప్రాధాన్యత లభించకుండా పోతోంది.

తాజాగా మోతీలాల్ పేరుతో రేవంత్ సర్కారుకు హరీశ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.మోతీలాల్ కు ఏమైనా జరిగితే రేవంత్ సర్కారు బాధ్యత వహించాల్సి ఉంటుందని మండిపడ్డారు. ఇంతకూ ఈ మోతీలాల్ ఎవరు? హరీశ్ సీరియస్ వార్నింగ్ లో విషయం ఏమైనా ఉందా? అన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. జాబ్ క్యాలెండర్ అంశం మీద మోతీలాల్ అనే వ్యక్తి ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో అతన్ని గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేసి అతని ఆరోగ్య పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు.

Read more!

ఈ నేపథ్యంలో మోతీలాల్ ను పరామర్శించేందకు వచ్చిన హరీశ్ మీడియాతో మాట్లాడారు. మోతీలాల్ చేస్తున్న దీక్షకు మద్దతు ప్రకటించిన హరీశ్ రావు.. నిరాహార దీక్షను విరమించాలన్నారు. ‘‘వారం రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా.. రేవంత్ సర్కారుకు చీమ కుట్టినట్లుగా లేదు. అతడి ఆరోగ్యం క్షీణిస్తోంది. అతడ్ని దీక్ష విరమించాలని మేం కోరాం. అతడి ఆరోగ్యానికి ఏమైనా అయితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా వచ్చి మోతీలాల్ తో నేరుగా మాట్లాడాలి. లేదంటే అసెంబ్లీని స్తంభింప చేస్తాం’’అని పేర్కొన్నారు.

తాము నిరుద్యోగుల పక్షాన నిలబడతామన్న హరీశ్.. నిరుద్యోగుల బాధ్యతను కోదండరామ్ తీసుకోవాలన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు మాత్రమే. అందులో నాలుగు నెలలు ఎన్నికల వ్యవహారంలోనే గడిచిపోగా.. మిగిలిన మూడు నెలలకే ఇన్నేసి మాటలు మాట్లాడటంలో అర్థం ఉందా? ఇంతలా విరుచుకుపడుతున్న హరీశ్.. తమ పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్యను కొంత పరిష్కరిస్తే.. ఈ రోజున ఇంతటి దారుణ పరిస్థితి ఉండేది కాదు కదా? ఏళ్లకు ఏళ్లుగా తాము చేయలేని పనిని.. మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని కోరుకోవటం అత్యాశ కాకుండా ఉంటుందా? దీనికి హరీశ్ ఏమని సమాధానం ఇస్తారో?

Tags:    

Similar News