భర్తతో ఎంపీ ప్రేమికుల రోజు ఫోటో షూట్... బీజేపీ ఫైర్!

మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర పరగణా జిల్లాలోని సందేశ్‌ ఖాలీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2024-02-15 11:26 GMT

మహిళలపై లైంగిక దాడుల ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర పరగణా జిల్లాలోని సందేశ్‌ ఖాలీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షాజహాన్‌ షేక్‌, అతడి అనుచరులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళలు ఆరోపించారు. ఈ క్రమంలో సందేశ్‌ ఖాలీలో వారంతా ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆందోళన చేస్తున్న భాదిత మహిళలకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు.


ఈ వ్యవహారాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు ఈ ఉద్రికత్తల నేపథ్యంలో రాష్ట్రంలో "144 సెక్షన్‌" అమలవుతోంది. ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మరోపక్క సందేశ్‌ ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింస ఘటనపై దర్యాప్తు చేయడానికి జేపీ నడ్డా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఒక మహిళా ఎంపీ ప్రేమికుల రోజున ఫోటో షూట్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... సందేశ్‌ ఖాలీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ ప్రేమికుల రోజును సెలబ్రేట్‌ చేసుకోన్నారంటూ భారతీయ జనతాపార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇందులో భాగంగా... టీఎంసీ ఎంపీ, నటి నుస్రత్‌ జహాన్‌ తన భర్త యశ్‌ దాస్‌ గుప్తాతో కలిసి వేలంటైన్స్ డే ని పురస్కరించుకుని ఫోటోషూట్‌ జరుపుకున్నారంటూ... దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ లో షేర్‌ చేస్తూ విమర్శలు గుప్పించింది.

ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. మరోపక్క సందేశ్‌ ఖలీ ఘటనను నడ్డా సీరియస్‌ గా తీసుకున్నారని.. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని.. ఘటనాస్థలికి వెళ్లి వాస్తవాలు సేకరిస్తామని బెంగాల్ బీజేపీ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఉన్నతస్థాయి కమిటీకి కేంద్రమంత్రి అన్నపూర్ణాదేవి కన్వీనర్‌ గా నియమితులయ్యారు.

ఇక కమిటీలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌ తో పాటు ఎంపీ సునీతా దుగ్గల్, ఎంపీ కవితా పటీదార్, ఎంపీ సంగీత యాదవ్, బ్రిజ్‌ లాల్ (రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) సభ్యులుగా ఉన్నారు. వీరంతా శుక్రవారం నాడు సంఘటనా స్థలాన్ని సందర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Tags:    

Similar News