నయా ట్విస్ట్: అంగారక గ్రహం – ఎలాన్ మస్క్.. మధ్యలో ట్రంప్!
ఈ సమయంలో మస్క్ గురించి ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్న్నికల గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. హారిస్ గెలిస్తే ఏమి లాభం, ట్రంప్ గెలిస్తే ఎంత మేలు.. ఎవరు గెలిస్తే కొత్త సమస్యలు వంటి ఆలోచనలు, అంచనాలతో పలు దేశాలు బిజీగా ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో మస్క్ గురించి ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి పోటీ ట్రంప్ - కమలా హరిస్ మధ్య నెలకొన్న నేపథ్యంలో... ఎలాన్ మస్క్ పాత్ర కూడా కీలకంగా మారిందని అంటున్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు మద్దతు పలుకుతున్న మస్క్.. ఆయన తరుపున ప్రచారం చేస్తుండటంతో పాటు భారీ ఎత్తున ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు!
అయితే... ప్రపంచ కుబేరుడికి ఉన్నపలంగా రాజకీయాలపై ఎందుకు ఆసక్తి వచ్చింది.. ట్రంప్ గెలుపును మస్క్ ఎందుకు కోరుకుంటున్నారు.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే కొత్తగా ఎలాన్ మస్క్ కు కలిగే ప్రయోజనం ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... ఎలాన్ మస్క్ ఈ స్థాయిలో యాక్టివ్ గా ఉండటం వెనుక ఉన్న హిడెన్ ఎజెండా తెలిసింది.
తాజాగా ఎక్స్ లో స్పందించిన ఓ నెటిజన్... అంగారక గ్రహంపై మానవాళి జీవనం సాగించాలని గత కొంతకాలంగా మస్క్ బలంగా వాదిస్తున్నారు.. ఈ సమయంలో అక్కడ మానవ కాలనీలను స్థాపించాలని అనుకుంటున్నారు.. అందుకే ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.. అని కామెంట్ చేశాడు.
దీనిపై స్పందించిన మస్క్... సదరు చెప్పిందంతా నిజమే అని స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎనికల్లో ట్రంప్ గెలవడం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆయన గెలుపు తర్వాత పెద్ద మార్పు కనిపిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.. అందుకె రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నట్లు చెబుతూ పోస్ట్ చేసారు.
కాగా... తాను అంగారక గ్రహం మీద చనిపోవాలని కోరుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ గతంలో ఓసారి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... ఐదేళ్ల లోపే ఆగ్రహం పైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుంద్ని.. 10 ఏళ్ల లోపు అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతామని.. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తామని కూడా చెప్పిన సంగతి తెలిసిందే!