ఫ్యూచర్ లో ఫోన్ లు ఉండవు... ఓన్లీ న్యూరాలింక్!

న్యూరాలింక్ మొదడు చిప్ ను మొదటిసారిగా మానవునికి ఈ ఏడాది జనవరిలో ఎలాన్ మస్క్ సంస్థ విజయవంతంగా అమర్చిన సంగతి తెలిసిందే

Update: 2024-06-18 12:50 GMT

న్యూరాలింక్ మొదడు చిప్ ను మొదటిసారిగా మానవునికి ఈ ఏడాది జనవరిలో ఎలాన్ మస్క్ సంస్థ విజయవంతంగా అమర్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఒక ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా భవిష్యత్తు కమ్యునికేషన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు! ఫ్యూచర్ లో మొబైల్ ఫోన్ ఉండదని.. న్యూరాలింక్ మాత్రమే ఉంటుందంటూ ఉన్న ఒక ట్వీట్ వైరల్ గా మారింది.

అవును... న్యూరాలింక్ మెదడు చిప్ ను మొదటిసారిగా 29ఏళ్ల వ్యక్తికి అమర్చిన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత పక్షవాతంతో మంచానికే పరిమితమైన నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తికి జనవరి 28న బ్రెయిన్ చిప్ ని అమర్చారు. ఈ క్రమంలో రెండు రోజుల శస్త్రచికిత్స తర్వాత అతను కోలుకున్నట్లు మస్క్ ప్రకటించారు.

ఈ క్రమంలో అర్భాగ్ ఆపరేషన్ అయ్యి 100 రోజులు పూర్తైన సందర్భంగా అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వివరణాత్మక నివేదికను మస్క్ షేర్ చేశారు. ఇదే క్రమంలో... న్యూరాలింక్ చీఫ్ రాబోయే రోజుల ఫోన్ల మనుగడపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా... భవిష్యత్తులో ఎటువంటి ఫోన్ కమ్యునికేషన్స్ ఉండవని.. న్యూరాలింక్ మాత్రమే ఆధిపత్యం చేలాయిస్తాయని మస్క్ పేర్కొన్నారు.

తాజాగా ఎక్స్ లో స్పందించిన ఆయన... భవిష్యత్తులో ఫోన్స్ ఉండవు.. కేవలం న్యూరాలింక్ లు మాత్రమే అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మస్క్ తన చేతిలో ఫోన్ పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు! ఆ ఫోటోలో మస్క్ నుదిటిపై న్యూరల్ నెట్ వర్క్ లాంటి డిజైన్ ను సూచిస్తుంది. ఇదంతా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించినట్లు చెబుతున్నారు!

మరోవైపు... న్యూరాలింక్ రెండో పార్టిసిపెంట్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ సందర్భంగా... న్యూరాలింక్ తన మొదటి రోగి వీడియోను ఎక్స్‌ లో షేర్ చేశామని, తమ క్లినికల్ ట్రయల్స్ కోసం పాల్గొనేవారి కోసం చూస్తున్నారని మస్క్ క్యాప్షన్‌ లో పేర్కొన్నారు.

Tags:    

Similar News