అసెంబ్లీలో లోకేష్ ఉగ్రరూపం... వీడియో వైరల్!
అవును... బడ్జెట్ సమావేశాల మూడో రోజు సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉగ్రరూపం దాల్చారు! శాసనమండలిలో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు! తనదైన శైలిలో స్పందిస్తూ విపక్ష సభ్యులపై విరుచుకుపడ్డారు! ఈ సందర్భంగా... గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారంటూ లోకేష్ మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అవును... బడ్జెట్ సమావేశాల మూడో రోజు సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ స్పందించారు. 2019-24 మధ్య చంద్రబాబు అన్ని సమావేశాలకూ హాజరయ్యారని చెబుతూ.. ఆయన అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసి వెళ్లడానికి గల పరిస్థితులను గుర్తు చేసుకుని నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా స్పందించిన నారా లోకేష్... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యకాలంలో చంద్రబాబు సభకు వచ్చారని.. సింహంలా సింగిల్ గా నిలబడ్డారని.. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించిన తర్వాతే ఆయన అసెంబ్లీ నుంచి ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారని అన్నారు. ఈ సందర్భంగా లోకేష్ ఫైర్ అయ్యారు.
టీడీపీ నేతలపై ఇవాళ మళ్లీ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని.. మాట్లాడాలనుకుంటే తాము కూడా మాట్లాడగలమని.. అయితే తాము ఏనాడూ జగన్ కుటుంబం గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని.. ఆరోజు తన తల్లిని అసెంబ్లీ సాక్షిగా అవమానించారని లోకేష్ తెలిపారు.
"ఆ రోజు నా తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడిన జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదు?" అంటూ నిలదీసిన లోకేష్... "నా తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టిక్కెట్ ఎలా ఇచ్చారు" అని ప్రశ్నిస్తూ నిప్పులు చెరిగారు.
కాగా.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం విషయంలో జగన్ పై షర్మిల వరుసగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క జగన్ అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు సైతం కోరుతున్న సంగతి తెలిసిందే!