నారా భువనేశ్వరి అలియాస్ నందమూరి ఆడపడుచు. ఆమె ఎన్టీయార్ మూడవ కుమార్తె. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన ఉంటూ కూడా రాజకీయం పొడ ఎన్నడూ దరిదాపుల్లోకి చేరనీయని ఇల్లాలుగానే జీవితం గడిపింది. అలాంటి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి రాష్ట్ర పర్యటనకు రెడీ అయ్యారు.
చంద్రగిరి నుంచి ఆమె ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రకు ముందు ఆమె ఈ నెల 24న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని వస్తారు. ఆ మీదట ఆమె మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలలో తన టూర్ ని కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక భువనేశ్వరి టూర్ నేపధ్యంలో నారా లోకేష్ ఎటూ తల్లి వెంట ప్రారంభ సభలో ఉంటారని అంటున్నారు. ఒక వారం పాటు భువనేశ్వరి టూర్ దాని మీద వచ్చే రెస్పాన్స్ వంటివి చూసేందుకు నారా లోకేష్ కూడా తన గ్యారంటీ యాత్రను నవంబర్ 1న పెట్టుకున్నారని అంటున్నారు.
అలా భువనేశ్వరి టూర్ కి టీడీపీ పార్టీ మొత్తం హాజరవుతుంది అని అంటున్నారు. పార్టీకి చెందిన సీనియర్లు, ఇతర్ పెద్దలు అంతా చంద్రగిరి చేరుకుంటారని అంటున్నారు. అయితే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్, ప్రముఖ సినీ నటుడు, బాబు కుటుంబానికి వియ్యంకుడు అయిన బాలయ్య చంద్రగిరికి వస్తారా అన్నది ఇపుడు చర్చగా ఉంది.
నిజానికి అయితే తన చెల్లెమ్మ కోసం బాలయ్య రావాల్సి ఉంది అనే అంటున్నారు. అయితే టీడీపీలో బాబు తరువాత స్థానాలు వరసగా భువనేశ్వరి, నారా లోకేష్ లకు పంచేసిన నేపధ్యం ఉంది. దాంతో బాలయ్య అందరి లాగానే వెళ్లి సంఘీభావం పార్టీ నేతగా తెలపాల్సి ఉంటుంది.
లేకపోతే కుటుంబ సభ్యుడిగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంతకంటే ఆయన చేయాల్సింది లేదనే అంటున్నారు. అయితే బాలయ్య రాక మీద చర్చ సాగుతోంది. టీడీపీలో బాలయ్య ఇపుడు గ్లామర్ ఫిగర్ గా ఉన్నారు. ఆయనతో ఏదైనా యాత్ర చేయిస్తే అది పార్టీకి ప్లస్ అయ్యేది అని అంటున్న వారూ ఉన్నారు.
బాలయ్య మూవీ కూడా లేటెస్ట్ గా హిట్ కొట్టి ఆయన మంచి ఫాం లో ఉన్నారు. ఈ నేపధ్యంలో బాలయ్యను టీడీపీ సరిగ్గా వాడుకోవడంలేదు అన్న చర్చ కూడా ఉంది. నిజానికి బాలయ్య మొదట్లోనే ఇలాంటి యాత్రను చేపడతాను అని ప్రకటించారు. నాడు ఆయనకు ఓకే చెప్పి ఉంటే ఈపాటికి టీడీపీకి ఎంతో కొంత సానుభూతి యాడ్ అయి ఉండేదని, పార్టీ శ్రేణులు కూడా డీలా పడి ఉండేవి కావని అంటున్నారు. కానీ బాలయ్యని ఏపీ నుంచి తెలంగాణా అన్నారు, ఆ మీదట ఇపుడు ఆయన పాత్ర టీడీపీలో ఏమిటి అన్నది అర్ధం కావడంలేదు అంటున్నారు
ఇక లోకేష్ నాయకత్వంలో తాజాగా మంగళగిరిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు, సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు, వర్ల రామయ్య, మాజీ మంత్రులు పాల్గొన్నారు, బాలయ్య అయితే రాలేదు, ఇంతటి కీలకమైన పార్టీ మీటింగ్ కి బాలయ్య రాకపోవడం మీద కూడా చర్చ సాగుతోంది. మరి బాలయ్య ఈ నెల 25న చంద్రగిరిలో కనిపిస్తారా భువనేశ్వరి టూర్ కి జయీభవా అని దీవిస్తారా అన్నది చర్చగానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.