లైవ్ అప్ డేట్స్: 15రోజుల రిమాండ్ కోరిన సీఐడీ!
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును విజయవాడకు తరలించిన పోలీసులు ముందుగా సిట్ కార్యాలయానికి తరలించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును విజయవాడకు తరలించిన పోలీసులు ముందుగా సిట్ కార్యాలయానికి తరలించారు. విజయవాడ జీజీహెచ్ లో వైద్యపరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధం చేశారు అధికారులు. ఈ సమయంలో ఏసీబీ కోర్టుకు చేరిన చంద్రబాబు స్వయంగా వాదనలు వినిపించారు.
కోర్టులో చంద్రబాబు వాదనలు:
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు న్యాయమూర్తి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని చెప్పిన ఆయన... స్కిల్ డెవలప్‌మెంట్ ను 2015-16 బడ్జెట్ లో పొందుపరచగా.. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని తెలిపారు.
ఇదే సమయంలో స్కిల్ స్కామ్ తో తనకెలాంటి సంబంధం లేదన్న చంద్రబాబు.. రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేశారని చెప్పుకున్నారు.
15రోజుల రిమాండ్ కోరిన సీఐడీ:
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద కోర్టుకు సీఐడీ రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. ఇందులో కీలక అభియోగాలు మోపింది.
371 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని అభియోగం మోపిన సీఐడీ.. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు చంద్రబాబును 15 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ కు ఇవ్వాలని సీఐడీ కోరింది.
ఈ స్కాంలో చంద్రబాబే చీఫ్ ఆర్కిటెక్ట్:
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కు సంబంధించి సుమారు 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను సమర్పించిన సీఐడీ.. ఈ రిపోర్ట్ లో చంద్రబాబుపై సంచలన అభియోగాలు నమోదు చేసింది. ఈ కుట్రకు చంద్రబాబును చీఫ్ ఆర్కిటెక్ట్ గా పేర్కొన్న సీఐడీ... నిందితులతో కలిసి చంద్రబాబు కుట్రకు పాల్పడ్డారని తెలిపింది!
తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అక్రమాలు:
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మొత్తం చంద్రబాబు చుట్టూనే జరిగిందని బలంగా చెబుతున్న ఏపీ సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా 371 కోట్ల రూపాయలను చెల్లించారని సీఐడీ పేర్కొంది.
ఇదే సమయంలో... తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని.. 2021 డిసెంబర్ 9 కంటే ముందు నేరం జరిగిందని రిమాండ్ రిపోర్టులో పెర్కొంది సీఐడీ. అదేవిధంగా... స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబే ముఖ్యమైన కుట్రదారని పేర్కొన్న సీఐడీ.. ప్రజాప్రతినిధిగా ఉండి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న పేర్కొంది.
రిమాండ్ రిపోర్ట్ లో లోకేష్ పేరు:
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో ముందునుంచీ లోకేష్ పాత్రపై కామెంట్ చేస్తున్న సీఐడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం రిమాండ్ రిపోర్ట్ లో నారా లోకేష్ పేరును సీఐడీ చేర్చింది. దీంతో ఈ స్కాం లో ఇదొక కీలక పరిణామం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా సీమెన్స్ సహా ఇతర కంపెనీల ప్రతినిధులు ఇల్లందులు రమేష్ ద్వారా చంద్రబాబును కలిసిన అనంతరం ఈ ఒప్పందం జరిగిందని చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఈ స్కాం చేశారని చెప్పిన సిట్... డబ్బు మొత్తం కిలారి రాజేష్ ద్వారా నారా లోకేష్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ లకు చేరిందని వెల్లడించింది.