నర్సాపురం ఎంపీడీవో ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్!?
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకట రమణారావు వ్యవహారం ఈ నెలలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకట రమణారావు వ్యవహారం ఈ నెలలో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయన ఆత్మహత్యకు ఫెరీ బకాయిలే కారణం అనే ఆరోపణలు తెరపైకి వస్తూ.. ఇందులో వైసీపీ నేతల ప్రమేయంపైనా ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
ఇందులో భాగంగా... రాష్ట్రంలో ఫెరీ బకాయిల వివరాలు, బకాయిలు పెడుతున్నవారి వివరాలను తక్షణమే తనకు అందిచాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్. అయితే ఆయన ఈలోపు వెంకట రమణారావు ఆత్మహత్య చేసుకోవడం!.. ఆయన మృతదేహాన్ని విజయవాడ శివార్లలోని ఏలూరు కాల్వలో పోలీసులు గుర్తించడం జరిగిపోయింది. అయితే తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చిందని అంటున్నారు!
అవును... నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆయన ఆత్మహత్యకు సైబర్ నేరగాళ్లే కారణం అని.. వారి ఒత్తిడికి తట్టుకోలేకనే వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నారనే మరో వాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారని.. ఈ సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు.
ఇందులో భాగంగా... సదరు ఎంపీడీవోను బ్లాక్ మెయిల్ చేసిన కీలక నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారని.. రాజస్థాన్ బర్కత్ పుర కు చెందిన యువకుడిని మూడు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారని.. ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగణమల పోలీసుల అధుపులో సైబర్ నిందితుడు ఉన్నాడని.. కథనాలొస్తున్నాయి. ఓ కేసు విచారణ కోసం వెళ్లిన సమయంలో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు.
దీంతో... వారిని తమ కస్టడీకి తీసుకుని విచారణ జరిపెందుకు కృష్ణాజిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారని అంటున్నారు. సుమారు పాతిక నుంచి ముప్పైమంది వరకూ ఈ గ్యాంగ్.. సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది! ఈ నేపథ్యంలోనే... వెంకటరమణరావు కూడా సైబర్ నేరగాళ్ల ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు భావిస్తున్నట్లు చెబుతున్నారు!