లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. నాసా ఉపగ్రహ చిత్రాలు ఏమి చెబుతున్నాయి?
అవును... లెననాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే.
సుమారు గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. హెజ్ బొల్లాపై బాంబులు వేయడం మొదలుపెట్టిన సుమారు వారం తర్వాత ఆ సంస్థ అధినేత నస్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఈ సమయంలో... ఇజ్రాయెల్ దాడులు జరిపిన ప్రాంతాన్ని నాసా ఉపగ్రహాలు గురించాయి.
అవును...లెబనాన్ Iపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హెజ్ బొల్లా సంస్థ అధినేతను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఈ సందర్భంగా స్పందించిన ఆ దేశ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు మాట్లాడుతూ.. తాము లెక్క సమయం చేసినట్లు తెలిపారు.
ఆ సంగతి అలా ఉంటే... భూమిపై వేడిని గుర్తించే నాసాకు చెందిన విజిబుల్ ఇంఫ్రారెడ్ ఇమేజింగ్ రేడియో మీటర్ సూట్ లో లెబనాన్ లో ఎక్కడెక్కడ దాడులు జరిగింది గుర్తించినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణప్రాంతంలో ఎక్కువగా వైమానిక, శతఘ్ని దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది హెజ్ బొల్లాకు ఎక్కువగా పట్టున్న ప్రాంతం.
ఈ సమయంలో దక్షిణ లెబనాన్ లోని కొన్ని ఆయుధ తయారీ కర్మాగారాలను కూడా తాము లక్ష్యంగా చేసుకొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎక్స్ లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ వార్.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తీవ్రతను తెలియజేసే జాబితాను తయారుచేస్తోంది.
వాస్తవానికి గాజాపై నుంచి లెబనాన్ పై ఇజ్రాయెల్ దృష్టి పెట్టిన కేవలం 12 రోజుల్లోనే హెజ్ బొల్లా అధినేత సహా మాగ్జిమం కమాండ్ వ్యవస్థను తుడిచిపెట్టింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న పేజర్ల పేలుళ్లతో సుమారు 4,000 మందిని గాయపరిచిన ఇజ్రాయెల్... 13 మందిని హతమార్చింది.
అనంతరం వాకీటాకీలు, ఇతర కమ్యునికేషన్ పరికరాలను పేలి మరో 14 మందిని హతమార్చింది. 450 మందిని గాయపర్చింది. సెప్టెంబర్ 20న బీరుట్ శివార్లలో 15 మంది హెజ్ బొల్లా సభ్యులను అంతం చేసింది. ఆ మరుసటిరోజు 450 హెజ్ బొల్లా టార్గెట్లను లక్ష్యంగా చేసుకొన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇక సెప్టెంబర్ 23న జరిపిన దాడిలో సుమారు 492 మంది చనిపోయారు. ఈ మొత్తం యుద్ధంలో దీన్ని అత్యంత భయంకరమైన రోజుగా చెబుతున్నారు. ఆ మరుసటి రోజు హెజ్ బొల్లా మిసైల్ డివిజన్ కమాండర్ ఇబ్రహీం కొబైస్సీ హతమయ్యాడు. సెప్టెంబర్ 25న 72 మందిని హతమార్చింది. ఆ మరుసటి రొజు చేసిన దాడుల్లో 92 మంది మరణించినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే... సెప్టెంబర్ 28న నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇది హెజ్ బొల్లాకు ఊహించని భారీ దెబ్బ. ఈ విధంగా మొదలుపెట్టిన 12 రోజుల్లో పెద్ద తలను పట్టుకుపోయింది ఐడీఎఫ్.