ట్రంప్ చేతికి బంగారు పేజర్.. అసలు అర్థం ఇదే

వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిసిన సందర్భంగా ఆయన చేతికి ఒక బంగారు పేజర్ ను బహుమతిగా అందించారు.

Update: 2025-02-07 05:54 GMT

అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా ఇజ్రాయెల్ అన్న విషయం తెలిసిందే. ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిసిన సందర్భంగా ఆయన చేతికి ఒక బంగారు పేజర్ ను బహుమతిగా అందించారు. ట్రంప్ కు ఇచ్చిన ఈ పేజర్ బహుమతిని చూసినంతనే స్పందించారు ట్రంప్.

ఇంతకూ దాని అసలు అర్థమేమంటే.. సెప్టెంబరులో లెబనాన్ లో హెజ్ బొల్లా సాయుద సంస్థ సభ్యులకు వేర్వేరు చోట్ల ఒకేసారి వేలాది పేజర్ లను పేల్చేసి హతమార్చినందుకు గుర్తుగా ఈ బంగారు పేజర్ ను ట్రంప్ కు గిఫ్టుగా ఇచ్చారు. ఆ బహుమతిని చూసినంతనే ట్రంప్ స్పందిస్తూ.. శత్రుదేశంలో ఇజ్రాయెల్ సాహస దాడి ఆపరేషన్ ను మెచ్చుకోవటం గమనార్హం. ‘అది నిజంగా ఒక గొప్ప ఆపరేషన్’ అని పేర్కొన్నారు.

గత ఏడాది సెప్టెంబరులో లెబనాన్ లోని హెజ్ బొల్లా ఉగ్రవాదులు ఉపయోగించిన వేలాది పేజర్లను ఒకేసారి పేలేలా చేయటం.. ఆ తర్వాతి రోజు వందలాది వాకీటాకీలు పేలటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో మొత్తం 39 మంది హెజ్ బొల్లా సభ్యులు మరణిస్తే.. 3వేల మంది గాయపడ్డారు. తమపై దాడికి తెగబడిన వర్గానికి గుణపాఠం చెప్పేందుకు వీలుగా ఇజ్రాయెల్ ఈ తరహా ఎదురుదాడికి దిగటం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తనకు బంగారు పేజర్ ను ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..ఆయన సతీమణికి ట్రంప్ ఒక ఫోటో ఫ్రేంను బహుకరించారు.

Tags:    

Similar News