ఈ టాబ్లెట్ వేసుకుంటే జిమ్ కు వెళ్లక్కర్లేదు కానీ... వివరాలివే!
ఈ క్రమంలో ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే కసరత్తులు చేయాలని సూచించేవారు చుట్టూ పెరిగిపోతుంటారు
ఇప్పటి రోజుల్లో పని ఒత్తిడి, నిద్రలేమి, జంక్ ఫుడ్, ఫలితంగా పెరుగుతున్న శరీరం బరువు, గ్యాస్ట్రిక్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలు నేటి ప్రజానికానికి! ఇక ప్రధానంగా పట్టణాల్లో ఉండేవారి పరిస్థితైతే ఉరుకులు పరుగులే! ఈ క్రమంలో వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి! దీంతో బద్దకించి కొంతమంది వ్యాయామం చేయలేకపోతే... అవకాశం లేక మరికొంతమంది జిమ్ వైపు చూడలేని పరిస్థితి.
ఈ క్రమంలో ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే కసరత్తులు చేయాలని సూచించేవారు చుట్టూ పెరిగిపోతుంటారు. ఈ సమయంలో కనీసం వాకింగ్ కూడా చేయలేని పరిస్థితి. ఫలితంగా... చిన్న వయసులోనే పెద్ద వయసు వచ్చినట్లుగా ముఖం మారిపోవడంతోపాటు.. ఆరోగ్యం కూడా ఇన్ స్టాల్ మెంట్ల వారీగా దెబ్బతినేస్తుంటుంది. అయితే... ఈ సమస్యకు ఒక టాబ్లెట్ తో పరిష్కారం చూపించబోతున్నారు శాస్త్రవేత్తలు! ఇది ఒకటి వేసుకుంటే ఇక జిమ్ కు వెళ్లకపోయినా పర్లేదంట!
వివరాళ్లోకి వెళ్తే... శరీరానికి వ్యాయామం ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనేది తెలిసిన విషయమే. అయితే అలా వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ కాలు కదపకుండానే అందించేందుకు ఒక పిల్ ను శాస్త్రవేత్తలు రూపొందించారంట. ఇందులో భాగంగా సెయింట్ లూయీ లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు సుమారు 10ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి దీన్ని తయారు చేశారు!
ఇక ఎల్.ఎల్.య్యూ-పీపీ-332 అనేదీ దీని శాస్త్రీయ నామం కాగా.. శరీరంలోని అధిక శక్తిని వినియోగించే కణజాలంలోని కొన్ని ప్రత్యేక రెసెప్టర్నలు ఈ పిల్ క్రియాశీలకంగా చేసి, వ్యాయామం చేసిన ఫలితాన్ని అందిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉండగా.. ఇందులో భాగంగా ఎలుకలపై ప్రయోగించినప్పుడు, వ్యాయామం తర్వాత ఉండే జీవక్రియను వాటిలో గుర్తించారని అంటున్నారు.
ఈ క్రమంలో ఈ విషయాలపై సపందించిన ఈ ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత ఎల్గెండీ.. వ్యాయామానికి మించినది లేదు.. ఏ రకంగా చూసినా వ్యాయామం శరీరానికి చాలా ముఖ్యం. అయితే... చాలా మందికి రకరకాల కారణాలతో అలాంటి అవకాశం ఉండదు. ప్రధానంగా రోగులకు, మంచానికే పరిమితమైన వ్యాయామం చేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు అలాంటివారికి కండరాల క్షీణత రాకుండా ఈ పిల్ సహకరిస్తుంది అని తెలిపారు!