నైజీరియన్లు తలనొప్పిగా తయారయ్యారా ?
నైజీరియన్లు తెలంగాణా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆఫ్రికా దేశస్ధులు ముఖ్యంగా నైజీరియన్లు ఉన్నారు.
నైజీరియన్లు తెలంగాణా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆఫ్రికా దేశస్ధులు ముఖ్యంగా నైజీరియన్లు ఉన్నారు. చదువుల పేరుతోనో లేదో ఇంకేదో పేరుతో మనదేశంలోకి అడుగుపెడుతున్నారు. ఒకసారి అడుగుపెట్టేశారంటే ఇక వాళ్ళిష్టారాజ్యంగా నడిపించుకుంటున్నారు. దేశంలోని చాలా నగరాల్లో ఇపుడిప్పుడే డ్రగ్ సంస్కృతి పెరుగుతోంది. ఇలాంటి నగరాల్లో హైదరాబాద్ కూడా ముందువరసలో ఉంటుంది. నగరంలో ప్రైవేటు స్కూళ్ళు సుమారు 10 వేల పైనే ఉన్నాయి. అలాగే ఐదారువేల కాలేజీలున్నాయి.
కొన్ని లక్షలమంది ఐటి కంపెనీల ఉద్యోగులున్నారు. వీళ్ళకి అదనంగా మరికొన్ని లక్షలమంది సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ వాళ్ళున్నారు. సినీ సెలబ్రిటీలే కాకుండా వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు. పోలీసులకు పట్టుబడుతున్న, కౌన్సిలింగుకు హాజరవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఇలాంటి అనేక వేలమందికి ఎక్కువగా డ్రగ్స్ అందుతున్నది డైరెక్టుగా నైజీరియన్ల నుండే.
నైజీరియన్లను ఎంతమందిని పోలీసులు అరెస్టులు చేసినా ఏదో కారణంతో బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. అలాగే పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళకి రీప్లేసుమెంటుగా మరికొందరు నైజీరియన్లు పుట్టుకొస్తున్నారు. టూరిస్టు, స్టూడెంట్ వీసాలతో మనదేశంలోకి అడుగుపెడుతున్న నైజీరియన్లు వెంటనే హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. ఏళ్ళ తరబడి హైదరాబాద్ లోనే తిష్టవేస్తున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. వీసాల గడువు ముగిసిన తర్వాత ఎంతమంది ఆఫ్రికన్లు వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నారనే విషయంలో ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవు.
నైజీరియా, సూడాన్, ఘనా, సోమాలియా దేశాలకు చెందిన యూత్ హైదరాబాద్ లో దిగేశారు. వీళ్ళంతా ఒక నెట్ వర్క్ గా తయారైనట్లు నిఘావర్గాలు గుర్తించాయి. లంగర్ హౌస్, మెహదీపట్నం, రాజేంద్రనగర్, బండ్లగూడ, హైటెక్ సిటి, కొండాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా మకాం వేసున్నారు. ముంబయ్, చెన్నై, గోవా నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ యువతకు అమ్ముతున్నారు. దేశంలో ఉంటున ఆఫ్రికా దేశస్ధలు మధ్య బలమైన నెట్ వర్క్ ఉంది. ఇంతేస్ధాయిలో వివిధ రాష్ట్రాల పోలీసుల మధ్య నెటవర్క్ లేకపోవటమే వీళ్ళకు బాగా అడ్వాంటేజ్ అవుతోంది. ఎవరినైనా పట్టుకున్నా తమకున్న కాంటాక్టులతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమ వాళ్ళని వెంటనే విడిపించుకోగలుగుతున్నారు. ఈ ధైర్యంతోనే డ్రగ్స్ వ్యాపారాన్ని విచ్చలవిడిగా చేస్తున్నారు.