జాం జాం గా రాజాం రాజకీయం: ఎమ్మెల్యేకు నో టికెట్...!?

సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులుకు నో టికెట్ అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇటీవల అధినాయకత్వం ఎమ్మెల్యేను పిలిపించుకుని మరీ అసలు విషయం చెప్పేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

Update: 2024-01-02 03:15 GMT

విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీకి ఈసారి కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని వైసీపీ చూస్తోంది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులుకు నో టికెట్ అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇటీవల అధినాయకత్వం ఎమ్మెల్యేను పిలిపించుకుని మరీ అసలు విషయం చెప్పేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

సీటు ఎవరికి ఇచ్చినా కలసికట్టుగా పనిచేయాలని హై కమాండ్ సూచించినట్లుగా చెబుతున్నారు. పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పార్టీ కోసం కష్టపడిన వారికి పూర్తి న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు

ఇదిలా ఉంటే పార్టీ నివేదికలలలో కంబాల జోగులు పట్ల వ్యతిరేకత కనిపించింది అని అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకుని వెళ్లకపోవడంతో పాటు దూకుడు తనం లేకపోవడం కూడా జోగులుకు మైనస్ అయ్యాయని అంటున్నారు. అదే విధంగా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఈసారి ప్రభావం చూపుతోంది అని అంటున్నారు

ఇక టీడీపీ తరఫున మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు ఈసారి పోటీలో ఉంటున్నారు. ఆయన గట్టి అభ్యర్ధిగా ఉన్నారు. దాంతో ఆయనకు ధీటైన అభ్యర్ధిని ఎంపిక చేయడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. కోండ్రు గతంలో రెండు సార్లు గెలిచారు. దాంతో పాటు ఆయనకు అంగబలం అర్ధబలం ఉన్నాయి. పైగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరరావు వర్గం మద్దతు ఉంది.

దాంతో కోండ్రుని తట్టుకోవాలంటే వైసీపీ గట్టి క్యాండిడేట్ నే బరిలోకి దించాల్సిన అవసరం ఏరపడింది. ఇక వైసీపీ కొత్తగా పోటీ కోసం అభ్యర్థుల అన్వేషణ మొదలెట్టింది అని అంటున్నారు. లోకల్ గా రాజాంలో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్న ఇద్దరు డాక్టర్ల పేర్లు కూడా వైసీపీ పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు.

వారితో పాటుగా అంగబలం అర్ధబలం ఉన్న వారి కోసం వెతుకుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా రాజం సీటుని మరోసారి గెలుచుకోవాలని వైసీపీ చూస్తోంది. ఇదిలా ఉంటే కంబాల జోగులుకి టికెట్ దక్కదని తెలిసి ఆయన అనుచర వర్గం నిరాశలో ఉన్నట్లుగా టాక్.

పార్టీ హై కమాండ్ అయితే హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే పదవి ఇస్తామని చెప్పింది. కానీ జోగులు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదే ఆసక్తిని రేపుతోంది. ఆయన పార్టీలో ఉంటారా లేక ఫిరాయిస్తారా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లినా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు, కేవలం హామీలు ఇస్తారు. అదే వైసీపీలో ఉంటే పార్టీ మళ్లీ గెలిస్తే కచ్చితంగా పదవి లభిస్తుంది అని అంటున్నారు. మొత్తానికి పార్టీ అధినాయకత్వం పట్ల విధేయతగా ఉండే జోగులు వైసీపీలోనే కొనసాగుతారా లేదా అన్నది ఇపుడు చర్చగా ముందుకు వస్తోంది.

Tags:    

Similar News