ఉచితాలపై వృద్ధురాలి కామెంట్స్.. ప్రభుత్వాలకు కునువిప్పు

ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టేల్లో పెట్టిన పథకాలతో కొందరు ఆనందపడుతుంటే మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-12-15 03:42 GMT

గెలుపు కోసం ఆయా పార్టీలు ఇచ్చిన హామీలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. సంక్షేమ పథకాలను పంచుతూ ప్రతీ ఒక్కరినీ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు తల్లి పాత్రను పోషించాలి. కానీ అవి జరగడం లేదని స్పష్టం అవుతుంది. ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టేల్లో పెట్టిన పథకాలతో కొందరు ఆనందపడుతుంటే మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భిన్నమైన అభిప్రాయాలు కొసాగుతున్నాయి.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సుప్రయాణాన్ని కల్పించింది. యువతుల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా రాష్ట్రం మొత్తం బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు చేయవచ్చు. ఈ పథకాన్ని డిసెంబర్ 09న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సీఎం అట్టహాసంగా ప్రారంభించారు. అప్పటి నుంచి బస్సులు మహిళలతో రద్దీగా మారుతున్నాయి. ఇన్నాళ్లు కొంచెం దూరానికి ప్రైవేట్ వాహనాల్లో ప్రాయాణం చేసిన మహిళలు ఒక్కసారిగా బస్సు ప్రయాణం చేయడం మొదలు పెట్టారు. దూరం ఎంతైనా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.

ఇక, ఈ ఫ్రీ జర్నీపై రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు మహిళల వాయిస్ తీసుకుంటున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది. ఈ పథకంతో కలిగే లాభాలపై ప్రశ్నిస్తున్నారు. అయితే.. మహిళల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ ఫ్రీ జర్నీతో ఆ భారం ప్రజలపైనే పడుతుందని అంటుంటే.. భారం మరింత తగ్గిందని మరి కొందరు సంతోషిస్తున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా..

ఇటీవల ఒక వృద్ధురాలు మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వృధ్యాప్యంలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రతీ ఒక్కరినీ ఆలోచింప చేస్తుంది. ఇంతకీ ఆమె ఏమందంటే.. ‘టికెట్ ఉంటేనే కదా ప్రభుత్వానికి డబ్బులు వచ్చేది. ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తే పెట్రోల్ ఎలా? డీజిల్ ఎలా? నేను రేపో ఎల్లుండో పోతా.. కానీ పిల్లల భవిష్యత్ ఎలా అని ఆలోచిస్తే భయం వేస్తుంది.’ ఆమె మాటలను పలువురిని ఆలోచింప చేస్తుంది. ఈ ముసలావిడకు ఉన్న సోయి ప్రభుత్వ పెద్దలకు లేదా? అన్న ప్రశ్నలు కామెంట్ల రూపంలో నెటిజన్లు సంధిస్తున్నారు.

ఏది ఏమైనా ప్రభుత్వం కల్పిస్తున్న ఫ్రీ జర్నీతో ఇటు ఆర్టీసీతో పాటు అటు ఆటో, టాక్సీ, చివరికి నగరంలో మెట్రోకు కూడా దెబ్బ పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News