కార్గిల్ యుద్ధం పాపం పాక్ దే...ఒప్పుకున్న దాయాది

పాక్ యుద్ధం లో తమ పాత్ర లేదని ఇన్నాళ్ళూ బొంకుతూ వచ్చిన పాక్ ఇపుడు తామే యుద్ధానికి కాలు దువ్వామని ఒప్పుకుంది.

Update: 2024-09-07 22:30 GMT

కార్గిల్ యుద్ధం పాక్ దే. ఈ విషయం మొత్తానికి దాయాది పాకిస్తాన్ అంగీకరించింది. కార్గిల్ యుద్ధం చేశామని అధికారికంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ డిఫెన్స్ డే సందర్భంగా ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. పాక్ యుద్ధం లో తమ పాత్ర లేదని ఇన్నాళ్ళూ బొంకుతూ వచ్చిన పాక్ ఇపుడు తామే యుద్ధానికి కాలు దువ్వామని ఒప్పుకుంది.

దీంతో ప్రస్తుతానికి ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన ఏమన్నారు అంటే భారత్ పాకిస్తాన్ ల మధ్య ఇప్పటికి జరిగిన యుద్ధాలలో వేలాది మంది పాక్ సైనికులు ప్రాణ త్యాగం చేశారు అని. 1948, 1965, 1971లతో పాటు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించారు.

కార్గిల్ యుద్ధం సియాచిన్ ఘర్షణలలో వేలాది మంది పాక్ సైనికులు ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది అని కూడా ఆయన చెప్పారు. ఈ విధంగా చెప్పడం పాక్ సైన్యం గొప్పతనాన్ని చాటాలని అనుకున్నా అదే సమయంలో కార్గిల్ పాపం సైతం అంగీకరించారు అని అంతా అంటున్నారు.

ఇదిలా ఉంటే అప్పట్లో బీజేపీ సంకీర్ణం కేంద్రంలో అధికారంలో ఉంది. ప్రధాన మంత్రిగా రాజకీయ ధురీణుడు వాజ్ పేయ్ ఉన్నారు. ఆయన ప్రధాని గానే పాకిస్థాన్ కి స్నేహ హస్తం చాటారు. ఆయన స్వయంగా శ్రీనగర్ నుంచి లాహోర్ దాకా బస్సు యాత్ర చేపట్టారు.

ఆ సమయంలో రెండు దేశాలు కలసి ఉండాలని బలంగా కోరుకున్నారు. ముషారఫ్ నాటి పాక్ అధ్యక్షుడు. ఆ విధంగా మాట ఇచ్చిన పాకిస్థాన్ వాజ్ పేయి ఇలా తిరిగి వచ్చారో లేదో అలా దొంగ దారిన కార్గిల్ యుద్ధానికి వచ్చింది. అలా భారత్ విశ్వాసాన్ని భారత్ అందించిన స్నేహ హస్తాన్ని కూడా పక్కన పెట్టి తన యుద్ధ కాంక్షను చాటుకుంది.

అంతే కాదు భారత్ మీద తన దాయాది స్వభావాన్ని భారత్ భూ భాగాలను కాజేయాలన్న తన దురుద్దేశ్యాన్ని సైతం చాటుకుంది. సరిగ్గా 1999 మే జూన్ నెలల మధ్యలో భారత్ పాకిస్తాన్ ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ముజాహిద్దీన్ ల ముసుగులో పాక్ సేనకు ఏకంగా నియంత్రణ రేఖను దాటేసి మరీ భారత్ భూ భాగంలోకి చొచ్చుకుని వచ్చారు.

కార్గిల్ లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను తమ పరం చేసుకున్నరు. ఆ దురాక్రమణను గుర్తించిన భారత సైన్యం అప్రమత్తం అయింది. దాంతో ఆపరేషన్ విజయ్ ని స్టార్ట్ చేసింది. భారత్ సైన్యం వీరోచిత పోరాటానికి పాక్ సైన్యం తోక ముడిచింది. అలా జూలై 26 నాటికి పాకిస్థాన్ మూక పారిపోయింది.

దాంతో ఆ రోజునే పాక్ సైన్యాన్ని తరిమికొట్టి విజయ దినం గా భారత్ ప్రతీ ఏటా జరుపుకుంటుంది. కార్గిల్ విజయ్ దివస్ అని దీనిని పేరు పెట్టారు. మొత్తం మీద చూస్తే పాకిస్తాన్ ఎప్పకపుడు తన దుర్బుద్ధిని భారత్ మీద చూపిస్తూనే ఉనిద్. ఆ విధంగా భారత్ ని దెబ్బ తీయాలని ఇప్పటికి నాలుగు యుద్ధాలు చేసిన పాక్ నాలుగింటా ఓటమి పాలు అయింది. అయినా ఈ రోజుకీ భారత్ మీద పగతో అక్కసుతో దాయాది ఉండడం చరిత్రలో చేదు నిజం.

Tags:    

Similar News