పాకిస్థాన్‌లో పేప‌ర్ ఇక్క‌ట్లు.. పాస్ పోర్టు కేంద్రాల వ‌ద్ద ప‌డిగాపులు!

దీంతో పేప‌ర్ స‌హా.. కొన్ని ముడి వ‌స్తువుల కొనుగోలును పాక్ ప్ర‌భుత్వం వాయిదా వేసుకుంది. అయితే.. ఈ ప్ర‌భావం కీల‌క‌మైన పాస్ పోర్టుల త‌యారీపై ప‌డింది.

Update: 2023-11-10 06:53 GMT

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన పాకిస్థాన్‌లో ప‌రిస్థితులు ఇంకా ఒక కొలిక్కి రాలే దు. అమెరికా జోక్యంతో అంత‌ర్జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు.. కొన్ని విభాగాల‌కు స‌ర్దు బాటు చేశారు. అయినా.. ఆర్థిక లోటు మాత్రం వెంటాడుతూనే ఉంది. దీంతో కీల‌క‌మైన పేప‌ర్ కొనుగోలుకు సంబంధించి నిధులు లేకుండా పోయాయి. పేప‌ర్ కొనుగోలు విష‌యంలో పాకిస్థాన్ చైనాపై ఆధార‌ప‌డి ఉంది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కుఅ ప్పులు ఇచ్చిన చైనా కూడా.. ఇప్పుడు ముఖం చాటేస్తోంది. దీంతో పేప‌ర్ స‌హా.. కొన్ని ముడి వ‌స్తువుల కొనుగోలును పాక్ ప్ర‌భుత్వం వాయిదా వేసుకుంది. అయితే.. ఈ ప్ర‌భావం కీల‌క‌మైన పాస్ పోర్టుల త‌యారీపై ప‌డింది. పాస్ పోర్టు రూపొందించేందుకు వినియోగించే పేప‌ర్‌ను పాకిస్థాన్ జ‌పాన్ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇప్ప‌టికే జ‌పాన్‌కు అప్పులు క‌ట్ట‌లేక ఇబ్బంది ప‌డుతుండ‌డంతో ఈ పేప‌ర్‌ను జ‌పాన్ నిలిపివేసింది.

ఈ ప‌రిణామాల‌తో పాకిస్థాన్ పౌరులు పాస్‌పోర్టు తిప్ప‌లు ప‌డుతున్నారు. గ‌త కొన్ని వారాలుగా పాస్ పోర్టులు ల‌భించ‌క ఆయా కార్యాల‌యాల ముందే ఎదురు చూస్తున్నారు. అత్య‌వ‌స‌రంగా విదేశాల‌కు వెళ్లేవారు ఇబ్బందులు ప‌డుతున్నారు. పాకిస్థాన్‌లో పెషావ‌ర్‌, ఇస్లామాబాద్‌, హైద‌రాబాద్ వంటి మూడు చోట్ల మాత్ర‌మే పాస్ పోర్టు కేంద్రాలు ఉన్నాయి.

అయితే.. ఇక్క‌డ పాస్ పోర్టులు రూపొందించే పేప‌ర్‌కు ఇబ్బందులు రావ‌డంతో వీటిని నిలిపివేశారు. కేవ‌లం రోజుకు 10 నుంచి 15 మ‌ధ్య మాత్ర‌మే అందిస్తున్నారు. పెషావ‌ర్‌లో అయితే... పాస్ పోర్టు జారీ కేంద్రాన్ని పూర్తిగా మూసివేశారు. దీంతో బ్రిట‌న్‌, ఇటలీల‌కు వెళ్లాల్సిన విద్యార్థులు పాస్ పోర్టులు అంద‌క‌.. స‌మ‌యం మించిపోతుండ‌డంతో ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News