అసలే పారిస్.. ఆపై ఒలింపిక్స్ లో'ఆటగాళ్లు'.. వారికోసం లక్షల కండోమ్ లు

అదే.. క్రీడాకారులకు 2 లక్షల కండోమ్‌ లు పంపిణీ చేసిన వైనం. 10 వేల మందికి పైగా అథ్లెట్లు పారిస్‌ క్రీడా గ్రామంలో ఉండనున్నారు.

Update: 2024-08-01 09:38 GMT

ఎవరు వాడుకలోకి తెచ్చారో గానీ.. ‘ఆటగాళ్లు’ అనే పదం తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఆటగాళ్లు పదం ఒలింపిక్స్ కూ సింక్ అవుతోంది. ఒలింపిక్స్ అంటే మహా క్రీడా సంగ్రామం అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో మరే క్రీడల్లోనూ ఈ స్థాయిలో ఆటగాళ్లు పాల్గొనరు. మొత్తం భూమ్మీద ఉన్న 205 దేశాల క్రీడాకారులు హాజరవుతారు. మరోవైపు ఒలింపిక్స్ కోసం వచ్చేవారికి కల్పించే వసతి కేంద్రమే క్రీడా గ్రామం. అయితే, ప్రతి ఒలింపిక్స్ కు ముందు ఒలింపిక్ గ్రామం పేరిట ఓ చిన్నపాటి నగరమే వెలుస్తుంది. ఆయా దేశాల క్రీడాకారులు, వారి కోచ్ లు, ఇతర సిబ్బందికి ఇందులో ఆశ్రయం ఇస్తారు.

ఫ్యాషన్ రాజధానిలో..

పారిస్ అంటే ఫ్యాషన్ రాజధాని అని చెబుతారు. అంతేకాదు.. ప్రేమ నగరి కూడా. మానవ హక్కలకు అత్యంత విలువ ఇచ్చే యూరప్ లో ఫ్రాన్స్ ఓ స్వేచ్ఛా దేశం అనుకోవాలి. అలాంటిచోట ఒలింపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో ఓ అంశంపై చర్చ సాగుతోంది. అదే.. క్రీడాకారులకు 2 లక్షల కండోమ్‌ లు పంపిణీ చేసిన వైనం. 10 వేల మందికి పైగా అథ్లెట్లు పారిస్‌ క్రీడా గ్రామంలో ఉండనున్నారు. దీంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ముందుజాగ్రత్త చర్యగా కండోమ్ లు పంపిణీ చేశారట. ప్రతి అథ్లెట్ కు 14 కండోమ్ ల చొప్పున ఇవ్వనున్నారు. క్రీడాకారులకు ప్రత్యేక కిట్ ను కూడా అందజేయనున్నారు. వీటిలో కండోమ్ లతో పాటు ఇతర వ్యక్తిగత శుభ్రతకు సంబందించిన సామగ్రి ఉండనున్నాయి. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ 2020లో జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. 2021లో జరిగినా అనేక ఆంక్షల మధ్య సాగాయి. ఇప్పుడు కొవిడ్ సంక్షోభం లేనందున పారిస్ లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం దక్కింది. మరో మాట.. ఏమంటే.. పారిస్ ఒలింపిక్ విలేజ్ లో యాంటీ సెక్స్ బెడ్ లు ఏర్పాటు చేశారట.

ఒక్కరే పడుకొనేలా మంచాలు..

విచ్చలవిడి శృంగారం జరగకుండా కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న.. యాంటీ సెక్స్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇలాంటి మంచాలపై అథ్లెట్లు నిద్రించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కరే పడుకోగలరు. సెక్స్ చేసేందుకు చాన్స్ ఉండదు. దీంతోనే యాంటీ సెక్స్ బెడ్ అని వీటికి పేరు పెట్టారు. పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం క్రీడా గ్రామాన్ని పర్యావరణహితంగా, అథ్లెట్ల అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. అథ్లెట్ల నుంచి సలహాలు, సూచనలతో మొత్తం 131 ఎకరాల్లోని ఈ గ్రామంలో 82 భవనాలు 3 వేల ప్లాట్లు 7,200 రూమ్స్ ఉన్నాయి. రూ.15,490 కోట్లను వ్యయం చేశారు. వేసవి ఒలింపిక్స్‌ లో పాల్గొనే 14,500 మందికే కాక పారాలింపిక్స్‌ లో పాల్గొనే 9 వేల మందికీ ఒలింపిక్ విలేజ్ వసతి కల్పించనుంది.

Tags:    

Similar News