ఒలింపిక్స్ లో "ఇంటిమసీ బ్యాన్" ఎత్తివేత... అందుబాటులో లక్షల కండోమ్స్!

ఫ్రాన్స్ వేదికగా ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్నాయి

Update: 2024-03-22 04:07 GMT

ఫ్రాన్స్ వేదికగా ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి రోజులు దగ్గరపడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో ఈ విశ్వక్రీడలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో... "ఒలింపిక్స్ విలేజ్"లో నిర్వాహకులు అన్ని వసతులను కల్పించాలని ఫిక్స్ అయ్యారు! ఈ నేపథ్యంలోనే "ఇంటిమసీ బ్యాన్"ను ఎత్తివేశారు!

అవును... పారిస్ ఒలింపిక్స్ కి సమయం దగ్గరపడుతున్న వేళ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా "ఇంటిమసీ బ్యాన్" ను ఎత్తివేశారు. తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఒలింపిక్ విలేజ్ డైరెక్టర్ లారెంట్ మిచాడ్... 2024 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఆ బ్యాన్ ను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో 14,250 మంది అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్ ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఇదే క్రమంలో అథ్లెట్స్ కమిషన్ తో కలిసి పనిచేస్తున్నామని.. అథ్లెట్లు ఉత్సాహంగా, కంఫర్టబుల్ గా ఉండేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నామని లారెంట్ మిచాడ్ తెలిపారు. ఇదే సమయంలో ఒలింపిక్ విలేజ్ లో ఆల్కహాల్ ఉండదు కానీ... పారిస్ లో వారికి కావాల్సిన షాంపైన్ ను మాత్రం పొందవచ్చని వెల్లడించారు.

కాగా... కోవిడ్ - 19 మహమ్మారి కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్ సమయంలో అథ్లెట్స్ సాన్నిహిత్యంగా మెలగడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే! కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ బ్యాన్ ను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఈ బ్యాన్ ను ఎత్తివేసి, పాత పద్దతులనే తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. 1988 సియోల్ ఒలింపిక్స్ నుంచి అథ్లెట్లకు కండోమ్స్ పంపిణీ చేస్తున్నారు.

Tags:    

Similar News