సినిమా వాళ్ళ మధ్యలోకి జగన్ ని తెచ్చిన పవన్

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మీద సెటైర్లు వేశారు.

Update: 2024-09-04 18:19 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మీద సెటైర్లు వేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమా వాళ్ల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా వాళ్ళది అంతా హడావుడి వాళ్ళ దగ్గర ఏముంటుంది అని పవన్ అనడం విశేషం.

సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించరని తాము చెప్పడం లేదని ఇతర రంగాలతో పోలిస్తే వారు సంపాదించిన దాని కన్నా ఆర్భాటమే ఎక్కువగా కనిపిస్తుంది అని పవన్ అన్నారు. వారి హడావుడి ఆ హంగామా చూసి ఏదో ఉంది అని అంతా అనుకుంటారని పవన్ అన్నారు.

ఒక పది లక్షల మంది జనాలు వచ్చారు కదా అని పది లక్షల కోట్లు సినిమా స్టార్ల వద్ద ఉండవని పవన్ అంటూ మధ్యలో జగన్ ప్రస్తావన తెచ్చారు. సైలెంట్ గా జగన్ లాంటి వారి వద్దనే లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని వారు ఎపుడూ సైలెంట్ గానే ఉంటారు అని పవన్ చెప్పడం విశేషం.

మరి ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందో మీడియా ఏ విధంగా పవన్ ని ప్రశ్నలు వేసిందో తెలియదు కానీ ఒక ప్రముఖ సినీ నటుడుగా కూడా ఉన్న పవన్ సినిమా వారిని వెనకేసుకుని వస్తూ వ్యాఖ్యలు చేశారు. ఆయన జగన్ అని అంటూనే సైలెంట్ గా చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయని అన్నారు.

అంటే ఏ రకమైన ఆర్భాటం చేయకుండా ఉండేవారి వద్దనే ఎక్కువ సొమ్ము ఉంటుందని పవన్ కళ్యాణ్ భావనగా ఉంది. మరో వైపు చూస్తే సినీ తారలు అంతా తమకు తోచిన విధంగా ఏపీ వరదలకు సంబంధించి ఆదుకోవడానికి నిధులు ఇచ్చారు. అందరూ భారీ మొత్తాలలోనే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అయితే తాను ఒక్కడే ఏకంగా ఆరు కోట్ల రూపాయల దాకా ఇచ్చారు.

నిజంగా పవన్ గ్రేట్ ఈ విషయంలో అని చెప్పాలి. రాజకీయ నాయకుడిగా ఉన్న పాన్ సినీ రంగం తరఫున తన పార్టీ తరఫున ఇంత భూరి విరాళం ఇచ్చారు. అదే విధంగా తెలంగాణా ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇచ్చారు. అదే సమయంలో ఇది పెను విపత్తు విమర్శలు మాని అంతా సాయం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.

వైసీపీ నేతలు ఇంట్లో కూర్చుని మాట్లాడటం కాదని వారు కూడా ఇతోధికంగా విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు. మరి ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని అంటున్నారు. సినీ రంగం ఎపుడూ ఏ ఆపద వచ్చినా నేనున్నాను అని విరాళాలు ప్రకటిస్తూ ఉంటుంది. అదే రాజకీయ రంగంలో ఉన్న వారు మాత్రం విరాళాలు పెద్దగా ఇచ్చినది లేదు. కానీ ఇపుడు అలాంటి ఒరవడి రావాలని అంతా కోరుకుంటున్నారు. పవన్ వరకూ అయితే ఆయన ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ కూడా కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇంకా చాలా మంది ముందుకు వస్తేనే కానీ బాధితులకు న్యాయం జరగదు అని అంటున్నారు.

Tags:    

Similar News