ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ ఫైర్ వెనుక ప్రధాన కారణం ఇదేనా?

ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-07 07:08 GMT

ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏపీ హోంమంత్రి అనిత పైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హోంమంత్రి పదవి తీసుకునే పరిస్థితి కల్పించొద్దన్నట్లుగా మండిపడ్డారు! అయితే... దీని వెనుక ఉన్న బలమైన కారణం ఇదే అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్య విపరీతంగా ఉందనే చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సోషల్ మీడియాలో ప్రముఖుల కుంటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్నారనే విషయంపై పెద్దలు ఫైరవుతున్నారని అంటుండటంతో పాటు.. ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు విపరీతంగా జరుగుతున్నాయనే విషయం కూడా కీలకం అని అంటున్నారు.

ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా అవతలి వ్యక్తి స్థాయితో సంబంధం లేకుండా.. పర్సనల్ గా అటాక్ చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాలప్డుతూ పోస్టులు పెడుతుండటం ఎక్కువైపోయింది. పలు అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఈ పైత్యం కనిపిస్తుండటం గమనార్హం. దీనికి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదని కూడా అంటుంటారు.

ఈ నేపథ్యంలో స్పందించిన పవన్... కొంతమంది పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ అత్యంత నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని.. చట్టప్రకారం పనిచేయమన్నా కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని.. గత ప్రభుత్వ హయాంలో చట్టాన్ని పక్కనబెట్టి మరీ పోలీసులు ప్రభుత్వ పెద్దలు చెప్పినవన్ని చేసేవారని మండిపడ్డట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... తన కుమార్తెలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని.. అవి వారు చూసి కన్నీరు పెట్టడం తనను తీవ్రంగా కలిచివేసిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేకపోయానని ఆయన తెలిపారు. దీంతో... పవన్ అసహనానికి ఇవన్నీ కూడా కారణాలని అంటున్నారు పరిశీలకులు!

ఇదే సమయంలో... కొన్ని కేసుల విషయంలో ఎస్పీలు సీరియస్ గా స్పందించడం లేదని.. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలికిన అధికారులు ఇప్పటికీ కీలక పోస్టింగుల్లో కొనసాగుతున్నారని పలువురు మంత్రులూ పేర్కొన్నారు. వైసీపీ నాయకుల అరాచకాలపై ఫోన్ చేసి చెప్పినా కూడా కొంతమంది ఎస్పీలు స్పందించడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

ఈ విధంగా.. పోలీసులు స్పందించడం లేదని.. తన కుమార్తెలు సైతం సోషల్ మీడియా బాధితులను పవన్ చెప్పడం పై చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఇందులో భాగంగా... కఠినంగా వ్యవహరిద్దామని, మరో నెలలో మొత్తం పోలీసు వ్యవస్థను గాడిలో పెడదామని పేర్కొన్నారు.

Tags:    

Similar News