పవన్ లాంటి మిత్రుడు చంద్రబాబుకు ఉండాల్సిందే...!
ఆయన కారుని, కాన్వాయ్ ని విజయవాడ వెళ్ళేందుకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. ఇదంతా శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘటన.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయనను సిట్ కార్యాలయంలో పోలీసు అధికారులు విచారిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని విపక్షాలు అన్నాయి. అంతవరకూ ఓకే. కానీ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ బాబుని చూసేందుకు ఎకాఎకీన బేగం పేట ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో రావాలని చూడడం, అయితే గన్నవరం విమానాశ్రయం అధికారులకు ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయనకు అనుమతి ఇవ్వలేకపోవడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పడం వల్ల పవన్ వెనుదిరిగారు అని వార్తలు వచ్చాయి.
సీన్ కట్ చేస్తే పవన్ డైరెక్ట్ గా కారు వేసుకుని మరీ రాత్రికి రాత్రి బాబుని కలిసేందుకు రావాలనుకోవడం నిజంగా గ్రేట్ అనిపించే మ్యాటరే. ఆయన కారుని, కాన్వాయ్ ని విజయవాడ వెళ్ళేందుకు పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. ఇదంతా శనివారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘటన.
మరో వైపు పవన్ కోసం వచ్చిన జన సైనికులతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అంతా ట్రాఫిక్ జాం అయింది. ఈ పరిణామాల నేపధ్యంలో విజయవాడ అవతల కారులో ఉండిపోయిన పవన్ కళ్యాణ్ తనకు పోలీసులు అనుమతిని ఇవ్వనందువల్ల కారు దిగి నడచుకుంటూ విజయవాడ వైపు రావడం నిజంగా బిగ్ ట్విస్ట్.
ఇంత పట్టుదలగా పవన్ కళ్యాణ్ చంద్రబాబును చూసేందుకు రావడం అంటే అది బాబు చేసుకున్న అదృష్టం అనే అంటున్నారు. పవన్ వంటి నమ్మకమైన మిత్రుడు బలమైన మిత్రుడు ఉండగా బాబుకు ఇంక వేరే బెంగ ఏలా అని కూడా అంటున్నారు. వైసీపీ నేతలు అన్నట్లుగా దత్తపుత్రుడా లేక మంచి మిత్రుడా ఏదో ఒకటి ఎవరు అనుకున్నా ఎలా తేల్చుకున్నా ఫరవాలేదు. పవన్ మాత్రం బాబుకు మంచి నేస్తం అంతే.
చంద్రబాబులోని పాలనా దక్షుణ్ణి చూస్తూ ఆయన అభిమానిగా మారిపోయిన పవన్ అప్పట్లో అంటే 2017, 2018 ప్రాంతాలలో టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం అని అన్నా కూడా అవి జస్ట్ అలా ఫ్లోలో అన్నారంతే అనుకుని వదిలేయాలంతే. పవన్ ఎపుడూ బాబుకు మంచి నేస్తమే అని వైసీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలను ఇపుడు కచ్చితంగా నమ్మాల్సిందేనని కూడా అంటున్నారు.
ఏపీలో రెండు పార్టీల కధ సాగుతోంది. మూడవ పార్టీగా ఆల్టర్నెషన్ గా మరో పార్టీ రావాల్సిన అవసరం ఉంది. అది పవన్ అయినా కావచ్చు అని అంతా అనుకున్నారు ఒకనాడు. అయితే పొత్తులతోనే తన రాజకీయ పార్టీని 2024 ఎన్నికల్లో నడిపించాలని చూస్తున్న పవన్ కి ఫ్యూచర్ ఆలోచనలు ఏమో కానీ బాబుకు ఇంతలా వెన్ను దన్నుగా నిలవడం చూస్తే మాత్రం ఆయన రాజకీయ వ్యూహాలలో ఇది ఒక భాగమా. లేక ఇదే రాజకీయామా అని అనిపించక మానదు అంటున్నారు.