డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం

ఇపుడు ఇద్దరి మధ్యన డైలాగ్ వార్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Update: 2024-10-04 16:44 GMT

ఒకాయన నాలుగు నెలల క్రిత్రం డిప్యూటీ సీఎం అయ్యారు. మరోకాయన నాలుగు రోజులు అయింది ఆ పదవిని తీసుకుని. ఇపుడు ఇద్దరి మధ్యన డైలాగ్ వార్ స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ డిప్యూటీలు ఎవరూ ఏంటే అందరికీ తెలిసిన వారే.

ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరొకరు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మారన్. ఆయన సనాతన ధర్మం మీద గతంలో మంత్రిగా ఉన్నపుడు కామెంట్స్ చేశారు అని ఉంది. ఆయన సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అది దేశవ్యాప్తంగా ఇష్యూ అయింది. అయితే దానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకుని తిరుపతి వారాహి సభలో గట్టిగానే మాట్లాడేసారు. సనాతన ధర్మం గురించి కొందరు వైరస్ లాంటిది అని అన్నారని, దానిని నిర్మూలించాలని అన్నారని అయితే ఆ ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరని చేయాలనుకుంటే వారే తుడిచి పెట్టుకుని పోతారు అని కూడా హాట్ కామెంట్స్ చేశారు.

దాని మీద ఇపుడు డీఎంకే నుంచి కౌటర్లు రావడం మొదలైంది. డీఎంకే డీఎంకే అధికార ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా పవన్ కామెంట్స్ మీద స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు.డీఎంకే ఎప్పుడూ ఏ మతాన్ని టార్గెట్ చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే కుల వివక్షతోపాటు, అంటరానితనం మీద అలాగే, కులపరమైన వేధింపులపైన ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇది ఎప్పటికీ కొనసాగే పోరాటం అన్నారు.

అంటే ఆయన చెప్పినది చూస్తే సనాతన ధర్మంలో ఇవన్నీ ఉన్నాయని అందుకే తమ పోరాటం అని చెప్పకనే చెప్పినట్లు అయింది అన్న మాట. అయితే ఆయన మరో మాట కూడా ఉన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా హిందూ మతానికి ఎప్పుడూ వ్యతిరేక ప్రకటనలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఉదయనిధి స్టాలిన్ ని మీడియా చుట్టుముట్టి పవన్ చేసిన వ్యాఖ్యమల మీ రియాక్షన్ ఏమిటి అన్నది అడిగినపుడు ఆయన వెయిట్ అండ్ సీ అని చాలా స్మూత్ గా చెప్పారు. అంటే వేచి చూడమని అన్న మాట. వేచి చూడడం అంటే దేని గురించి ఎందుకు అన్నది అయితే ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఇక పోతే డీఎంకే ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీగా కీలకంగా ఉంది. డీఎంకే లేకుండా ఇండియా కూటమి ముందుకు వెళ్లలేదు. ఈసారి కేంద్రంలో అధికారంలోకి ఇండియా కూటమి వస్తుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో 2029 నాటికి టార్గెట్ గా పెట్టుకున్నారు.

అంటే మా రోజులు వస్తాయని చెప్పడమే ఉదయ నిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ కామెంట్స్ వెనక అర్ధమా అని చర్చించుకుంటున్నారు. పవన్ జనసేన అయితే అవుట్ రేట్ గా బీజేపీకి మద్దతుగా ఉంది. ఎన్డీయే ప్రభ కేంద్రంలో ప్రస్తుతం సాగుతోంది. దాంతో డీఎంకే వేచి చూడాలని అనుకుంటోందా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఏది ఏమైనా ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా పొరుగున ఉన్న తమిళనాడులో ఎవరి అధికారంలో ఉన్నా ఎక్కడా వివాదాలు లేవు. ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటూ వస్తున్నారు. పైగా స్నేహ భావంతో ఉంటున్నారు. అయితే పవన్ ఇపుడు ఇండైరెక్ట్ గా అయినా చేసిన ఈ కామెంట్స్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య స్మూత్ రిలేషన్స్ లో ఏమైనా తేడా వస్తుందా అన్నది చూడాలని అంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ఎవరితో వివాదాలకు పోరు. ఆయన సీనియర్ మోస్ట్ నేతగా దేశంలో ఉన్నారు ఆయనకు అందరూ దగ్గరి వారే అన్నట్లుగా ఉంటారు. అయితే ఇపుడు మాత్రం డిప్యూటీల మధ్య కామెంట్స్ తో ఏమి జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది మరి.

Tags:    

Similar News