వైసీపీ సోషల్‌ మీడియాకి పవన్‌ గట్టి కౌంటర్‌!

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తొలి రోజునే కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను పంపిణీ చేసింది.

Update: 2024-07-02 06:20 GMT

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తొలి రోజునే కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లను పంపిణీ చేసింది. తొలి రోజే 95 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూటమి ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లను పంపిణీ చేశారు.

కాగా పింఛన్ల పంపిణీ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రధాన పత్రికలకు ఫుల్‌ పేజీ యాడ్లు ఇచ్చింది. అయితే ఇందులో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను మాత్రమే ముద్రించారు. దీన్ని వైసీపీ సోషల్‌ మీడియా అందిపుచ్చుకుంది. పవన్‌ కు అవమానం జరిగిందని.. పవన్‌ ఫొటోను ముద్రించలేదని వైసీపీ సోషల్‌ మీడియా ప్రచారం చేసింది.

అలాగే పింఛన్‌ లబ్ధిదారులకు నగదుతోపాటు అందజేసిన పాంప్లెట్‌ లోనూ కేవలం చంద్రబాబు ఫొటో మాత్రమే ఉందని.. పవన్‌ కళ్యాణ్‌ ఫొటో లేదని వైసీపీ సోషల్‌ మీడియా ప్రచారం చేసింది. ఇక పవన్‌ కు అవమానాలు మొదలయ్యాయంటూ టీడీపీ –జనసేన మధ్య చిచ్చుకు తెరతీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే.. వైసీపీ సోషల్‌ మీడియా ప్రచారానికి పవన్‌ కళ్యాణ్‌ పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. తన నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని గొల్లప్రోలులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ పవన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.

Read more!

ఇది కూటమి ప్రభుత్వమని.. ఇందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉందని పవన్‌ తెలిపారు. అయితే ఈ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ కూడా భాగమేనన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి చాలా ముఖ్యమని తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానన్నారు. పింఛను పథకం విజయవంతం కావడం కూడా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తొలిరోజే ఇన్ని లక్షల మందికి పెంచిన పింఛన్‌ ను అందించడం ఆయన పాలనా ద„ý తకు నిదర్శమని కొనియాడారు.

ఇన్ని ఆర్థిక గారడీల మధ్య 7000 రూపాయల పెన్షన్‌ ఇవ్వడం చంద్రబాబు అనుభవం వల్లే సాధ్యమైందని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. తాము బాధ్యతలు చేపట్టి నెల కూడా కాలేదన్నారు. కానీ పింఛన్లు పెంచి గత మూడు నెలల బకాయిలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఇదంతా చంద్రబాబు పాలనా అనుభవం వల్లే సాధ్యమైందని తెలిపారు.

తద్వారా తనకు, చంద్రబాబుకు ఏదో గ్యాప్‌ సృష్టించాలని భావించిన వైసీపీ సోషల్‌ మీడియాకు పవన్‌ కళ్యాణ్‌ పరో„ý ంగా గట్టి కౌంటరే ఇచ్చారని అంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు.. పవన్‌ కళ్యాణ్‌ కు అత్యంత గౌరవ, మర్యాదలు ఇస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అలాగే పవన్‌ సైతం చంద్రబాబు పట్ల అంతే గౌరవంతో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. వారి మధ్య ఎలాంటి అరమరికలు లేవని.. వారిద్దరి స్నేహాన్ని చెడగొట్టడం ఎవరి వల్లా కాదని తేల్చిచెబుతున్నారు.

Tags:    

Similar News