జనసేనతో వైసీపీ పొత్తు... తనదైన స్పష్టత ఇచ్చిన పవన్!

అవును... "2017 ఆగస్టు ఆ సమయంలో నంద్యాల ఎన్నికల్లో జగన్ పార్టీ పరాజయం పాలైన తర్వాత.. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీలోని కొంత మంది భావించారు.

Update: 2024-05-10 12:25 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడింది. మరోపక్క శనివారం సాయంత్రంతో మైకులు మూగపోబోతున్నాయి.. ప్రచార రథాలు నిలిచిపోబోతున్నాయి! ఇలా ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే వ్యవధి ఉండటంతో నేతలు, అధినేతలు అలుపెరుగకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. అదే... జనసేనతో జగన్ పొత్తు వ్యవహారం!

అవును... "2017 ఆగస్టు ఆ సమయంలో నంద్యాల ఎన్నికల్లో జగన్ పార్టీ పరాజయం పాలైన తర్వాత.. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీలోని కొంత మంది భావించారు.. జనసేనతో పొత్తుకు సంబంధించి తమ ప్రతిపాదనను నాతో పంచుకున్నారు.. కానీ అది చివరకు జరగలేదు" అంటూ ఇటీవల ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా జనసేన అధినేత పవన్ కు ఈ ప్రశ్నే ఎదురైంది. ఇందులో భాగంగా... "2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ మీతో పొత్తుపెట్టుకోవాలని ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమే కదా..?" అనే ప్రశ్నకు స్పందించారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో... "మధ్యవర్తులు చాలా చోట్ల ఉంటారు కదా.. ప్రతీ పార్టీలోనూ ఉంటారు.. జరుగుతుంటాయి.. వాళ్ల ఆలోచనా పరంగా నాకు కుదరదు" అని అన్నారు.

ఇదే సమయంలో... "వాళ్లైతే ప్రయత్నం చేశారు!?" అనే కొనసాగింపు ప్రశ్నకు స్పందించిన పవన్... "జరుగుతుంటాయి.. నాదాకా వస్తుంటాయి.. ఎవరో ఏదో చెబుతుంటారు.. వింటా ఉంటాను అంతే" అని తెలిపారు! దీంతో.. జనసేనతో వైసీపీ పొత్తు అనేది జగన్, పవన్ స్థాయి చర్చ, నిర్ణయం కాదని.. ఎవరో మధ్యవర్తుల మధ్య డిస్కషన్ మాత్రమే అని స్పష్టత ఇచ్చినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News