పవన్ ఫుల్ బిజీ... వారాహి యాత్ర అపుడేనటగా...?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి మూడు జిల్లాలలో తిరిగింది. అందులో ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపు నెల రోజుల పాటు వారాహి యాత్రలో పవన్ కేక పుట్టించారు.

Update: 2023-09-05 11:09 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి మూడు జిల్లాలలో తిరిగింది. అందులో ఉభయ గోదావరి జిల్లాలలో దాదాపు నెల రోజుల పాటు వారాహి యాత్రలో పవన్ కేక పుట్టించారు. రాజకీయంగా కాక రేకెత్తించారు. ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి విశాఖ జిల్లాలో వారాహి మూడవ విడత యాత్ర మొదలెట్టారు. ఒక పది రోజుల పాటు సాగింది. రెండు పబ్లిక్ మీటింగ్స్, ఒక నాలుగు ప్రాంతాలలో సందర్శన వంటివి చేశారు.

ఆ మీదట పవన్ సినిమాలో బిజీ అయిపోయారు. ఇక పవన్ కొత్త సినిమా ఉస్తాద్ షూటింగ్ కోసం ఏకంగా యాభై రోజుల నుంచి అరవై రోజుల పాటు డేట్స్ ఇచ్చారని టాక్ అయితే సాగుతోంది. అంటే సెప్టెంబర్ అక్టోబర్ ఈ రెండు నెలలూ పవన్ సినిమా సెట్స్ మీదనే ఉంటారా అన్న డౌట్స్ వస్తున్నాయి.

మరి రాజకీయాల్లో ఎలా అంటే ఈ రెండు నెలల పాటు పాలిటిక్స్ కి విరామం అని అంటున్నారు. తాను కమిట్ అయిన సినిమాలను తొందరగా పూర్తి చేసి పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఒక వేళ రేపటి ఎన్నికల్లో జనసేన పొత్తులతో భాగంగా అధికారంలోకి వస్తే మళ్లీ సినిమాలకు టైం ఉంటుందో లేదో అన్న ముందు చూపుతో ఆయన ఇప్పటిదాకా కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసేయాలని తపన పడుతున్నారు అని అంటున్నారు.

అదే టైం లో ఆయన సినిమాలు కూడా ఎన్నికలలో బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. ఎన్నికల వేళకు ఈ సినిమాలు రిలీజ్ అయితే ఆ విధంగా కూడా మంచి పబ్లిసిటీ వస్తుందని, జనసేనకు అది ఎంతగానో ఊపు తెస్తుందని కూడా పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే రాజకీయ వాతావరణ వేడెక్కే ఉంది. ముందస్తు ఎన్నికలు జమిలి ఎన్నికలు అని కేంద్రం అంటోంది. కేంద్రం కనుక సంచలన డెసిషన్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా ఏపీ కూడా అదే బాటలో నడుస్తుంది. అపుడు ఏపీలో కూడా డిసెంబర్ లో ఎన్నికలు తప్పకపోవచ్చు అని అంటున్నారు.

దాంతో టీడీపీ అయితే జోరు మీద ఉంది. చంద్రబాబు జిల్లాల టూర్లు వరసబెట్టి చేస్తున్నారు. అయితే పవన్ పొలిటికల్ ప్లాన్ చూస్తే వేరేగా ఉందని అంటున్నారు. నవంబర్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ఫీల్డ్ లోకి దిగేలా చూసుకుంటున్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే పొత్తుల విషయం సీట్ల సెలక్షన్ ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేశాయా అన్న డౌట్లు వస్తున్నాయి. జనసేన గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రాలో ఎక్కువ సీట్లలొ పోటీ చేస్తుంది అని అంటున్నారు. అలాగే ప్రతీ జిల్లాకు ఒకటి రెండు సీట్లు వంతున పొత్తులలో భాగంగా తీసుకుంటుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్నికల వేడి పూర్తిగా వచ్చాకనే వారాహి తో ఏపీలో టూర్లు మొదలెడతారు అని తెలుస్తోంది. ఈలోగా ఆయన సినిమాలో ఫుల్ బిజీ అవుతారు అని ప్రచారంలో ఉన్న మాట. ఏది ఏమైనా జనసేన ఈసారి ఎన్నికల్లో కీలకం అవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News