ప్రత్యర్థులకు షాకిచ్చేందుకు ప్లాన్ రెఢీ చేసిన పేటీఎం
అనూహ్యంగా వచ్చిన సంక్షోభానికి కిందా మీదా పడే వాళ్లు కొందరైతే.. మరికొందరు మరింత రాటుదేలుతారు
అనూహ్యంగా వచ్చిన సంక్షోభానికి కిందా మీదా పడే వాళ్లు కొందరైతే.. మరికొందరు మరింత రాటుదేలుతారు. మొదట్లో కాస్త వెనకడుగు వేసినట్లుగా కనిపించినా.. మొహమాటంతో కాసిన్ని ఇబ్బందులకు గురవుతారు. కానీ.. ఆ క్రమంలో ఎంత అవసరమో అంతలా రాటు తేలటం జరుగుతుంది. తాజాగా పేటీఎం పరిస్థితి కూడా అంతే. అనూహ్యంగా వచ్చి పడిన షాకింగ్ పరిణామంతో త్రోటుపాటుకు గురైనప్పటికి.. నాలుగైదు రోజుల్లోనే పరిస్థితికి అనుగుణంగా తమ అడుగుల్ని మార్చుకోవాలన్న వ్యూహంలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం మూత పడుతుందని.. తమకు తిరుగు ఉండదన్నట్లుగా సంబరపడిన పలు టెక్ కంపెనీల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడిన పరిస్తితి. పేటీఎం మూతపడుతుందని.. తమకు తిరుగులేదని సంబరానికి గురైన ప్రత్యర్థి కంపెనీలకు మింగుడు పడని రీతిలో రియాక్టు అవుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒక ప్రముఖ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన కథనాన్ని చూస్తే.. సంక్షోభంలో చిక్కుకున్న పేటీఎం ఒరిజినల్ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్తన వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండేలా థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ మార్గంపై ఫోకస్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ప్లాన్ ను ఎప్పటికో కానీ అమలు చేయకుండా.. ఇప్పటికే ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్లుగాచెబుతున్నారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పేటీఎం యూజర్లు ఇప్పటివరకు చెల్లింపులు జరిపిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ ను మార్చి 1 తర్వాత నుంచి వీపీఏలు వేరే బ్యాంక్ హ్యాండిల్ కు మారుతాయని చెబుతున్నారు. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోకుండా ఉండేలా ఆర్ బీఐ జనవరి 31 నుంచి పేటీఎం బ్యాంక్ ను బ్యాన్ చేయటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పేటీఎం తన యూపీఐ కస్టమర్ల కోసం కొత్తగా మూడు లేదంటే అంతకు మించిన ఎక్కువ బ్యాంకులతో బాగస్వామ్యం చేసుకోనున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యాక్సిస్ బ్యాంక్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. యస్ బ్యాంకులు ఈ లిస్టులో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ తీరు పేటీఎం మాత్రమే చేయటం లేదు. ఇదే తరహాలో అమెజాన్ పే.. గూగుల్ పే.. ఫోన్ పేలతో సహా ఇప్పటికే 22 థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ లు యూపీఐ సర్వీసులు అందిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా పేటీఎం సంక్షోభం నుంచి బయటకు రావాలని తపించటమే కాదు.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.