పెద్దిరెడ్డి ఫ్యామిలీలో సీట్ల మార్పు.. జగన్ షాకింగ్ డెసిషన్...!?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు.ఇ క, ఆయన తనయుడు రాజంపేట ఎంపీగా ఉన్నారు.
వైసీపీ కీలక నాయకుడు, మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంలో రాజకీయ మార్పులు ఖాయమా? ఆదిశగా వైసీపీ అధినేత దృష్టి పెట్టారా? వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబానికి చెందిన నాయకులను స్థానాలను మార్చాలని వైసీపీ అధినేత నిర్ణయించారా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం పెద్దిరెడ్డి కుటుంబంలో ఏకంగా ముగ్గురు వైసీపీలో ఉన్నారు. వారికి క్రమం తప్పకుండా టికెట్లు కూడా ఇస్తున్నారు. అంతేకాదు.. పార్టీలోనూ ప్రాధాన్యం ఉంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు.ఇ క, ఆయన తనయుడు రాజంపేట ఎంపీగా ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి కూడా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తంగా పెద్దిరెడ్డి కుటుంబంలోనే ముగ్గురు పార్టీలో మూడు స్థానాలు పొంది.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. వీరి గ్రాఫ్‌ను పరిశీలించిన తర్వాత.. పెద్దిరెడ్డి ఫ్యామిలీకి మూడు టికెట్లు కాదని రెండేఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
అయితే, మూడు టికెట్లు ఇచ్చినా.. ప్రస్తుతం ద్వారకానాథ్ నాథ్‌రెడ్డి పరిస్థితి నియోజకవర్గంలో ఇబ్బందిగా ఉందనేదిప్రధాన ఆరోపణగా ఉంది. ఈయన గెలుపు గుర్రమే అయినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న తీవ్రమై న పోటీ నేపథ్యంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఐప్యాక్ సర్వేలోనూ ఆయనకు వ్యతిరేకంగా రిపోర్టు వచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో కొత్తముఖం కోసం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు.. తంబళ్ళపల్లి నుంచి తాను వెనుదిరిగేది లేదని.. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టికెట్ ఇస్తారని.. ఆయన బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. తనవరకు అంతా బాగానేఉందని కూడా చెబుతున్నారు. కానీ, అధిష్టానం మాత్రం అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. ఇక, పెద్దిరెడ్డిని పుంగనూరుకు కాకుండా.. ఎంపీగా పంపిస్తారనే ప్రచారం కూడా ఉంది. మంత్రివర్గంలో ఆయన హవాను తగ్గించాలనేది ప్రధాన రీజన్‌గా చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనను పార్లమెంటుకు పంపించి.. ఆయన కుమారుడిని అసెంబ్లీకి తీసుకుంటారని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.