అందరికి హోల్ సేల్ బండలు వేసిన పేర్ని నాని

‘రాజకీయ లబ్థి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు లోకేవ్. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక అసలైన లోకేశ్ బయటకు వస్తాడు.

Update: 2023-12-23 03:58 GMT

వెనుకా ముందు చూసుకోకుడా కాన్ఫిడెంట్ గా మాట్లాడే మాజీ మంత్రి పేర్నినాని.. మాటలతో ఉతికి ఆరేసే విషయంలో అత్యంత ఆసక్తిని ప్రదర్శించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను.. టీడీపీ ముఖ్యనేత నారా లోకేశ్ పై మరోసారి సెటైర్లు వేశారు. ఘాటు కామెంట్లు చేస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ముగిసిన లోకేశ్ యాత్ర గురించి వ్యాఖ్యానించిన పేర్ని నాని.. ‘‘నారా లోకేశ్ ది అట్టర్ ప్లాప్ యాత్ర. చంద్రబాబు పాపపు సొమ్ముతో లోకేశ్ యాత్ర చేశారు. యువగళంతో టీడీపీ ఏం సాధించింది?’’ అంటూ ప్రశ్నించారు పేర్ని నాని.

లోకేశ్ చేసింది పాదయాత్ర కాదు జంపింగ్ జపాంగ్ యాత్రగా అభివర్ణించారు. లోకేశ్ యాత్ర కోసం వచ్ిన మేనమామ కొడుకు చనిపోతే యాత్రను ఆపలేదని.. కానీ చంద్రబాబు జైలుకు వెళితే మాత్రం యాత్రను ఆపేశారన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకుడు సమస్యల పరిష్కారానికి ఆలోచిస్తాడని.. యువగళం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బూతులు తిట్టటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.

‘రాజకీయ లబ్థి కోసమే మొక్కుబడి యాత్ర చేశారు లోకేవ్. సాయంత్రం సూర్యుడు దిగిపోయాక అసలైన లోకేశ్ బయటకు వస్తాడు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి పవర్లోకి రావాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదు చంద్రబాబు. ప్రజలు ఆయనకు అధికారాన్ని చేతికి ఇస్తే 650 హామీల్ని ఇచ్చి.. అన్నింటిని గాలికి వదిలేశారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎరవేయటంచంద్రబాబుకు అలవాటు. అధికారం కోసం ఎన్ని తప్పుడు మాటలు.. మోసాలైనా చేస్తారు. ఇప్పుడు కొత్తగా హామీలు ఇవ్వటం మొదలు పెట్టారు’’ అంటూ విరుచుకుపడ్డారు.

తమను పాలేరులంటూ తిట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ మరోసారి ఫైర్ అయ్యారు పేర్ని నాని. ‘‘మనల్ని పాలేరులు అని తిట్టిన పవన్ ఇప్పుడు ఎవరికి పాలేరుగా పని చేస్తున్నారు? పరజలను మోసం చేసేందుకు చంద్రబాబు.. లోకేశ్.. పవన్ ప్రయత్నిస్తున్నారు. 2019లో పంచ సూత్రాలు అన్నారు. 2024లో ఆరు సూత్రాలు అంటున్నాడు. తప్పుడు పనులు చేసి.. అధికారం కొట్టేయాలి. దోచుకు తినాలన్నదే బాబు ఆలోచన’’ అంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మూడు గ్యాస్ బండలు ఎందుకు ఇవ్వలేదన్న పేర్నినాని.. 2014 నుంచి 2019 వరకు మహిళలకు ఫ్రీ బస్సులు ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News