కాంగ్రెస్ గెలుపు మీద పీకే వక్రభాష్యం..!

గెలుపు ఎపుడూ గెలుపే దానికి అర్ధాలు పరమార్ధాలు ఉండవు. విజయం అంటే అది కచ్చితంగా అలాగే చూడాలి.

Update: 2023-12-10 11:58 GMT

గెలుపు ఎపుడూ గెలుపే దానికి అర్ధాలు పరమార్ధాలు ఉండవు. విజయం అంటే అది కచ్చితంగా అలాగే చూడాలి. తగ్గించాలని ప్రయత్నాలు చేయడం అంటే వక్రంగా ఆలోచన చేయడమే. గెలుపు ఎపుడూ ఒక్కరికే దక్కుతుంది. ఒకరు గెలిచారు అంటే అవతల వారు ఓడ బట్టి మాత్రమే. మరి దాన్ని వక్రంగా ఆలోచిస్తే ఇంకోలా కూడా చెప్పవచ్చు. అదెలా ఉంటే వెనకవాడు ఓడిపోయాడు కాబట్టే ముందు వాడు గెలిచాడు అని కూడా తమదైన కోణం నుంచి చక్కగా చెప్పవచ్చు.

కానీ అది సబబుగా ఉంటుందా అన్నది ఆలోచించాలి. వెనక ఒకడు ఉన్నాడూ అంటే వాడి కంటే మరొకరు ముందుకు రాబట్టి వారి కష్టఫలం బట్టి అని ఎందుకు ఆలోచించరాదు అన్నది కీలకమైన ప్రశ్న. అయితే మేధావితనం ఎక్కువగా ఉంటే చాలా ఇలాంటివి చెప్పవచ్చు. దానికి లాజిక్ అని కూడా కలిపి మరీ చెప్పవచ్చు.

ఒక గ్లాస్ లో నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మూడవ వంతు మాత్రమే ఖాళీగా ఉందని కూడా చెప్పవచ్చు. తన మేధావితనం అంతా ఏర్చి కూర్చి అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఇపుడు తెలంగాణా ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు మీద తనదైన విశ్లేషణ చేస్తున్నారు. కాంగ్రెస్ గెలవలేదు అని ఆయన అంటున్నారు.

బీఆర్ఎస్ ఓడింది కాబట్టే కాంగ్రెస్ గెలిచింది అని అంటున్నారు. అయితే ఇదంతా బీఆర్ఎస్ ని పెంచడానికి కాంగ్రెస్ ని తగ్గించడానికి అని అంతా అంటున్నారు. బీఆర్ఎస్ ని ఆల్టర్నేషన్ మరో పార్టీ లేకనే ప్రజలు కాంగ్రెస్ కి ఓటేసారు తప్ప ప్రేమతో అభిమానంతో కాదని పీకే అంటున్నారు. మరి కాంగ్రెస్ కి మెజారిటీ ఇచ్చిన ప్రజలు వారి తీర్పుని పీకే ఇలా వేరేగా అర్ధాలు చెబుతున్నట్లుగా ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుని అధికారంలో ఉన్న పార్టీలు ఓడాయని కూడా తెలంగాణాలోని బీఆర్ఎస్ ఓటమిని జనరలైజ్ చేస్తూ పీకే విశ్లేషిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ఉత్తరాదిన విజయం సాధించలేదు అని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి పీకే అయితే కాంగ్రెస్ విజయాన్ని వీలైనంత వరకూ తక్కువ చేస్తున్నారు.

అయితే ఇంతకీ పీకే మరచిపోతున్న లాజిక్ పాయింట్ ఏంటి అంటే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉందని. ఆయన అది చెబుతున్నారు కానీ కాంగ్రెస్ కి సక్సెస్ క్రెడిట్ మాత్రం ఇవ్వడంలేదు. అందుకే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అన్నది కూడా పీకేని ప్రశ్నించాల్సి వస్తోంది అని అంటున్నారు. అదే విధంగా రెండు టెర్ములు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చినపుడు లేని లాజిక్కులు ఇపుడు కాంగ్రెస్ విషయంలో ఎందుకు వస్తున్నాయి పీకే అని కూడా అంతా ప్రశ్నిస్తున్నారు.

ఆనాడు బీఆర్ఎస్ గెలిచింది వేరే ఆల్టర్నేషన్ లేకనే అని పీకేనే ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ఇంతకీ పీకేకి ఈ బాధ ఎందుకు అంటే ఆయన బీఆర్ఎస్ కి కొన్నాళ్ళ పాటు వ్యూహకర్తగా పనిచేశారని అంటున్నారు. ఇక చివరి నిముషంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం కూడా పీకేని పిలిపించుకుని చివరి నిముషంలో ఆపరేషన్ ఏమైనా చేసేందుకు సిద్ధపడింది అని కూడా అంటున్నారు.

ఏది ఏమైనా కాంగ్రెస్ తో చెడిన పీకే ఆ పార్టీ విజయాల మీద ఎపుడూ ఇలాగే మాట్లాడుతారు అని అంటున్నారు. ఇక బీజేపీ హిందీ బెల్ట్ లో మూడు రాష్ట్రాలు గెలుచుకుంటే ఆ పార్టీ సంస్థాగత బలం అని ఆ పార్టీ ఫిలాసఫీ అని చెబుతున్న పీకేకి తెలంగాణాలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉందని తెలియదా లేదా తెలిసి తక్కువ చేసేందుకు చూస్తున్నారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా పీకే ఇపుడు యాంటీ కాంగ్రెస్ స్లోగన్ తో ఉన్నారు. ఆయన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేయలేమని అంటున్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News