బెట్టింగులో ఆ ఎస్ఐకు రూ. కోటిన్నర.. దిమ్మ తిరిగే షాకిచ్చిన అధికారులు
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ "డ్రీమ్11"లో పాల్గొన్న మహారాష్ట్రకు చరెందిన ఒక ఎస్ఐ వ్యవహారం సోషల్ మీడియాలోనూ.. మీడియాలో అందరిని ఆసక్తికి గురి చేసింది.
అన్ని ఉద్యోగాలు ఒకేలా ఉండవు. కొన్ని ఉద్యోగాల్లో బాధ్యత మిగిలిన ఉద్యోగాలకు మించి ఉంటుంది. ఇలాంటి ఉద్యోగాలు చేసే వారికి టైంతో సంబంధాలు ఉండవు. అంతేకాదు.. కొన్ని ఎథిక్స్ ను ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. క్రమశిక్షణ మిగిలిన జాబ్ ల కంటే ఎక్కువగా ఉండేవాటిల్లో పోలీసు శాఖ ఒకటి. తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ లో రూ.1.5కోట్లు సొంతం చేసుకున్న ఒక ఎస్ఐకు ఉన్నతాధికారులు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు.
అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ "డ్రీమ్11"లో పాల్గొన్న మహారాష్ట్రకు చరెందిన ఒక ఎస్ఐ వ్యవహారం సోషల్ మీడియాలోనూ.. మీడియాలో అందరిని ఆసక్తికి గురి చేసింది. పింప్రీ-ఛించ్వాడ్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్ఐగా పని చేసే సోమనాథ్ కు ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లు అంటే అభిమానం.
ఇందులో భాగంగా ఆక్టోబరు 10న డ్యూటీలో ఉండగా.. ఇంగ్లండ్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కు సంబంధించి ఉత్తమ ఆటగాళ్లతో తుది జట్టును ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆయన రూ.1.5 కోట్ల మొత్తాన్ని ప్రైజ్ రూపంలో గెలుచుకున్నారు.
దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. తమకు తెలిసిన సన్నిహితులకు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ వివరాలు సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ గా మారాయి. దీనిపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.
అంతేకాదు.. ఈ మొత్తం ఉదంతంపై విచారణకు ఆదేశించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. డ్యూటీ లో ఉండి బెట్టింగ్ లో పాల్గొనటం క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా పేర్కొంటున్నారు. అయినా.. డ్యూటీ చేస్తూ ఆన్ లైన్ బెట్టింగ్ చేయటం ఏమిటి? అందునా పోలీసు అధికారి అయినప్పుడు.. ఇలాంటి ముప్పును ముందే పసిగట్టాలి కదా?