మూడ్ ఆఫ్ విజయనగరం...!
ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎవరికి ఎక్కడ బలాలు ఎంత బలహీనతలు ఎంత అన్నది సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి
ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎవరికి ఎక్కడ బలాలు ఎంత బలహీనతలు ఎంత అన్నది సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి ఒక ప్రముఖ సర్వే సంస్థ ఫిబ్రవరి 5వ తేదీ వరకూ చేసిన సర్వేలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం జనసేన కూటమి ఎక్కడ గట్టిగా ఉన్నాయి అన్నది పూర్తిగా వివరించే ప్రయత్నం చేసింది.
అందులో భాగంగా విజయనగరంలో ఓటర్ల మూడ్ ఎలా ఉంది అన్న దాని మీద చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో వెలుగు చూశాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం చూస్తే మూడు అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం ఆధిక్యంలో ఉండగా, నాలుగు చోట్ల వైసీపీ లీడ్ లో ఉంది. మరో రెండు చోట్ల హోరా హోరీ పోరు ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఇలా ఉంది.
విజయనగరం అసెంబ్లీ సీటులో టీడీపీ జనసేన కూటమికి 52 శాతం ఓట్ల షేర్ కనిపిస్తూంటే వైసీపీకి 44.5 శాతం ఓట్ల షేర్ ఉంది. ఇతరులకు రెండు శాతం ఉంటే సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ 1.5 శాతంగా ఉంది. ఇక్కడ టీడీపీ 7.5 శాతం ఓట్ల షేర్ తో వైసీపీ మీద ఆధిక్యంగా ఉండడం విశేషం.
బొబ్బిలిలో తీసుకుంటే టీడీపీ జనసేన కూటమి 50.5 శాతం ఓట్ల షేర్ తో బలంగా ఉంది. వైసీపీకి 45.25 ఓట్ల షేర్ మాత్రమే దక్కనుంది. ఇతరులకు 2.5 శాతం ఉంటే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.75 శాతంగా ఉంది. ఇక్కడ 5.25 శాతం ఓటు షేర్ తో టీడీపీ కూటమి వైసీపీ మీద ఆధిక్యంలో ఉంది.
గజపతినగరంలో తీసుకుంటే వైసీపీ 50 శాతం ఓటు షేర్ తో ఉంటే టీడీపీ జనసేన కూటమి 45.5 శాతం ఓటు షేర్ తో ఉంది. ఇతరులకు రెండు శాతం, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2.5 శాతం ఉండడం విశేషం. ఇక్కడ వైసీపీ టీడీపీ కూటమి మీద 4.5 శాతం లీడ్ తో కొనసాగుతోంది.
నెల్లిమర్ల తీసుకుంటే వైసీపీ 49.5 శాతం ఓటు షేర్ తో ఉంటే టీడీపీ కూటమి 48 శాతం ఓటు షేర్ తో ఉంది. ఇతరులకు 1.5 శతం ఉంటే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1 శాతం ఉంది. ఇక్కడ వైసీపీ టీడీపీల మధ్య 1.5 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండడంతో హోరాహోరీ పోరు తప్పేట్లు లేదు అని అంటున్నారు
చీపురుపల్లి తీసుకుంటే వైసీపీ 53 శాతం ఓటు షేర్ తో ఉంటే టీడీపీ కూటమి 43.5 శాతం ఓట్ షేర్ తో ఉంది. ఇతరులకు 2 శాతం. సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 1.5 శాతం ఉంది. ఇక్కడ ఏకంగా 9.5 శాతం లీడ్ తో వైసీపీ టీడీపీ కూటమి మీద ఉంది.
సాలూరులో చూస్తే వైసీపీ 50 శాతం ఓటు షేర్ తో ఉంటే టీడీపీ జనసేన కూటమి 46 శాతంతో ఉంది. ఇతరులకు 1.5 శాతం సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2.5 శాతంగా ఉంది. నాలుగు శాతం లీడ్ తో వైసీపీ టీడీపీ మీద ఇక్కడ ఉంది.
కురుపాంలో తీసుకుంటే వైసీపీ 51 శాతం ఓటు షేర్ తో ఉంటే టీడీపీ కూటమి 45 శాతం ఓటింగ్ తో ఉంది. ఇతరులు 1.75 శాతంతో ఉంటే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కింద 2.25 శాతం ఉంది. ఇక్కడ వైసీపీ టీడీపీ కూటమి మీద ఆరు శాతం లీడ్ తో ఉంది.
పార్వతీపురం తీసుకుంటే వైసీపీక్ 49.25 శాతంగా ఉంటే టీడీపీ కూటమికి 47.75 శాతంగా ఉంది. ఇతరులకు 1.5 శాతం ఉంటే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ గా 1.5 శాతం ఉంది. అంటే ఇక్కడ కేవలం 1.5 శాతం తో హోరా హోరీ రెండు పార్టీల మధ్య ఉంది.
శ్రుంగవరపుకోట సీటు చూస్తే టీడీపీ కూటమి 49.5 శాతంతో ఉంటే వైసీపీ 45.5 శాతంతో ఉంది. ఇతరులు 2.5 శాతం, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 2.5 శాతంగా ఉంది. ఇక్కడ టీడీపీ కూటమి వైసీపీ మీద 4.5 శాతం ఓట్ల తేడాతో లీడ్ లో ఉంది. అదే విధంగా చూస్తే టీడీపీలో ఇద్దరు అభ్యర్ధులు ఉన్నారు. ఒకరు గొంప క్రిష్ణ. మరొకరు మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి, ఈ ఇద్దరిలో కోళ్ళ లలితకుమారికి టికెట్ ఇస్తే నలభై శాతం కంటే ఎక్కువ ఓటు షేర్ ని పొందే అవకాశం ఉంది. అదే గొంప క్రిష్ణకు టికెట్ ఇస్తే 18 శాతం ఓటు షేర్ నే పొందుతారు అని సర్వే వెల్లడించింది. ఇక ఎస్ కోట సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉంది అని సర్వే చెబుతోంది. అదే సమయంలో గొంప క్రిష్ణకు టికెట్ ఇస్తే మాత్రం ఈ సీటు వైసీపీ పరం అవుతుందని సర్వే చెప్పడం విశేషం.