ఓరుగల్లులో పొంగులేటితో పోరు తప్పేలా లేదే !

దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ పని జరగాలన్నా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి నోటీసులో లేకుండా ఏదీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.

Update: 2024-08-04 05:19 GMT
ఓరుగల్లులో పొంగులేటితో పోరు తప్పేలా లేదే !
  • whatsapp icon

వరంగల్ జిల్లా అంటే తెలంగాణలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ పని జరగాలన్నా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి నోటీసులో లేకుండా ఏదీ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.

వైఎస్ మంత్రివర్గంలో ఏకచత్రాధిపత్యం వహించిన కొండా సురేఖ ఆయన మరణానంతరం వైసీపీ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి తిరిగి 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2023 ఎన్నికల్లో గెలిచి రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గం మంత్రిగా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, శాసనమండలి సభ్యుడుగా, ఇటీవల తిరిగి బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కూడా జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడే.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవాడే. మొత్తం ఉమ్మడి జిల్లాలో జనగామ మినహా 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. కానీ ఎక్కడా తమ మాట చెల్లుబాటు కావడం లేదని వీరంతా మదనపడుతున్నట్లు తెలుస్తుంది.

దొంతి మాధవరెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంత వరకు సీఎం రేవంత్ ను కలవలేదు. జిల్లా పర్యటనకు వచ్చినా ఆ సమావేశాలలో పాల్గొనలేదు. ఇక కొండా సురేఖ మంత్రిగా ఉన్పప్పటికీ ఇంచార్జ్ మంత్రి అనుమతులతోనే అన్ని పనులు జరగాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో ఎవరైనా పనికోసం వస్తే తన చేతులు కట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంఛార్జ్ మంత్రిగా పొంగులేటి అందరినీ కలుపుకుని వెళ్తే బాగుంటుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. మరి పొంగులేటి ఏ విధంగా ముందుకు వెళ్తాడో వేచిచూడాలి.

Tags:    

Similar News