పూనమ్ మరో ఘాటు ట్వీట్... హ్యాష్ ట్యాగ్ ఏపీ అంటూ సెటైర్స్!
హ్యాష్ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్
తెలుగు సినీ జనాలకు.. రాజకీయాలపై ఆసక్తి, అవగాహన ఉన్న ప్రజలకు పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే అనుకోవాలి. గతకొంతకాలంగా రెగ్యులర్ గా టీట్లు చేసే పూనమ్ కౌర్... ఎవరినో ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు ట్వీట్స్ చేస్తుంటారని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా మరో ట్వీట్ చేశారు పూనమ్. ఈ సందర్భంగా రాజకీయ నాయకులను బలంగా టార్గెట్ చేశారు. జనాలకు జాగ్రత్తలు చెప్పారని అంటున్నారు!
అవును... పూనమ్ కౌర్ ఏ ట్వీట్ పెట్టినా ఆ ట్వీట్ తెలుగు మీడియాలో హైలెట్ అవుతుంటుంది. అయితే ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారు.. ఎవరిపై సెటైర్స్ కోసం ఆ ట్వీట్ ని ప్రయోగించారు.. ఫలితంగా ఈ ట్వీట్ వల్ల ఎవరు భుజాలు తడుముకుంటున్నారు అనే సంగతులు కాసేపు పక్కనపెడితే... తాజాగా పొలిటీషియన్స్ ని టార్గెట్ చేసి ట్వీట్ చేశారని తెలుస్తుంది.
"మహిళల సమస్యలపై మహాశ్రద్ధ ఉన్నట్టు గొంతు చించుకుని అరుస్తున్న వీళ్ళు.. మహిళా రెజ్లర్ల కష్టాల గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. వాళ్ల స్వలాభం, సౌకర్యాలే ప్రధానమైన నకిలీ నాయకులతో జాగ్రత్తగా ఉండండి" అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. దీనికి తోడు ఆమె "హ్యాష్ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్" అని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
దీంతో హెచ్చరికతో కూడిన సలహాగా ఉన్నట్లుగా ఉన్న ఈ ట్వీట్ ఏపీ రాజకీయాలతో ముడిపడిన అంశంగా పలువురు అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది. దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో పూనమ్ ట్వీట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుందని అంటున్నారు. "మహిళలపై మహాశ్రద్ధ ఉన్నట్లు నాటకాలాడుతున్న నకిలీ పొలిటీషియన్స్" అని ఎవరిని ఉద్దేశించి అన్నారు అని తెగ చర్చించుకుంటున్నారని తెలుస్తుంది.
మరోపక్క దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహిళా రెజ్లర్ల సమస్యపై స్పందిస్తే ఏ పార్టీకి నష్టం అనే చర్చ.. ఆ పార్టీకి ఎవరు మిత్రులుగా ఉన్నారు అనే డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయని తెలుస్తుంది.
ఏది ఏమైనా... కాస్త ఘాటుగానే చేసినట్లున్న ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది. మరోపక్క ఈ ట్వీట్ పలానా వారిని ఉద్దేశించే చేసి ఉంటారని ఆన్ లైన్ వేదికగా పలువురు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారని అంటున్నారు.