అంబటి రాంబాంబును చూసి పోసాని భావోద్వేగం వీడియో!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన నిన్న గుంటూరు సీఐడీ కోర్టు ద్వారా బెయిల్ పొందారు.;

Update: 2025-03-22 13:26 GMT

సినీనటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన నిన్న గుంటూరు సీఐడీ కోర్టు ద్వారా బెయిల్ పొందారు.

ఈరోజు ఉదయం కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ కాపీలను జైలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అన్ని నిబంధనలు పూర్తయిన తర్వాత పోసానిని జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం ఆయన హైదరాబాద్ లోని ఇంటికి బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.

జైలు నుంచి విడుదలైన అనంతరం పోసాని కృష్ణమురళి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకుడు అంబటి రాంబాబు ఆయనను ఓదార్చి ధైర్యం చెప్పారు.

పోసాని విడుదల సందర్భంగా ఆయన అభిమానులు , వైసీపీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. ఆయన విడుదల తర్వాత వారు హర్షం వ్యక్తం చేశారు.

కాగా పోసాని కృష్ణమురళి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేయగా, నిన్న కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఆయన జైలు నుంచి విడుదల కావడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోసాని కృష్ణమురళి పలు కోర్టుల నుండి బెయిల్ పొందారు. అయితే ఆ బెయిల్ షరతుల్లో పోలీసుల దర్యాప్తుకు సహకరించాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా, మరికొన్ని కేసుల్లో హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎప్పుడైనా ఆయన్ను విచారణకు పిలిచే అవకాశం ఉంది.

Full View

గతంలోనూ బెయిల్ పొందినప్పటికీ విడుదలయ్యేలోపే సీఐడీ పోలీసులు మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసి పోసానిని అరెస్టు చేశారు. వరుస కేసుల్లో పిటీ వారంట్లతో రిమాండ్ ఎదుర్కొన్నారు పోసాని. అప్పటి నుండి 26 రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసాని కృష్ణమురళి తాజాగా విడుదలయ్యారు. ఈ పరిణామం ఆయనకు ఊరట కలిగించింది.

Tags:    

Similar News