పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ : ఏపీ మూడ్ ఏంటో ?

ఏపీలో హో ఓటింగ్ అన్నది ఈ నెల 3న స్టార్ట్ అయింది.

Update: 2024-05-05 11:30 GMT

ఏపీలో సాధారణ ఓటర్లు ఓటు చేయడానికి ఈ నెల 13వ తేదీ వరకూ ఆగాలి. వారు పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్ళి మరీ ఓటు వేయాల్సి ఉంది. ఇక అందరి కంటే ముందు ఏపీలో ఓటు వేసే వారు హోం ఓటర్లు. వీరు 85 ఏళ్ళు నిండిన వయో వృద్ధులు. ఏపీలో హో ఓటింగ్ అన్నది ఈ నెల 3న స్టార్ట్ అయింది. ఈ నెల 10 వరకూ కొనసాగనుంది.

ఇక ఈ నెల 4 నుంచే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది. మూడు రోజుల పాటు సాగనుంది. ఏపీలో ఈసారి పెద్ద ఎత్తున ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం కీలక పరిణామం. పైగా వారంతా ఓటింగ్ కోసం ఓటర్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాల వద్ద బారులు తీరడంతో ఏపీకి పోలింగ్ కళ వచ్చింది.

ఒక ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా ఒక రోజు క్యాజువల్ లీవ్ ని కూడా మంజూరు చేస్తున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో ఉద్యోగులకు ఇది పెద్ద ఉపశమనంగా మారింది. ఇక ఈసారి దాదాపు 3 వేల మందికి పైగా సర్వీసు ఓటర్ల కోసం కొత్తగా పోస్టల్ బ్యాలెట్ ప్రవేశపెడుతున్నారు.

మరో వైపు చూస్తే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్న ఉద్యోగులను సైతం ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం విశేషం. తమకే ఓటు వేయాలని ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు వినతి చేశారు ఇక ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ప్రధాన రాజకీయ పార్టీల ఏజేంట్లు చేరుకోవడంతో పోలీసులు వారిని నియంత్రిస్తున్నారు.

ఏపీలో మూడ్ ఎలా ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి రానుంది అన్నది ఉద్యోగుల ఓటింగ్ ద్వారా కాస్తా అయినా తెలియవచ్చు అని అంటున్నారు. అయితే గతంలో మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులు ఏకపక్షంగా ఈసారి ఒకే పార్టీకి ఓటు వేసేది లేదని అంటున్నారు. వారు కూడా పార్టీలుగా విడిపోయిన నేపధ్యం కనిపిస్తోంది అని అంటున్నారు.

దాంతో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పడే ఓట్లు ఏ రాజకీయ పార్టీకీ గుత్తమొత్తంగా పడవు అని అంటున్నారు. దాంతో పాటు రెండు ప్రభుత్వాలను వరసగా చూసిన ఉద్యోగులకు పక్కా క్లారిటీ అయితే ఉందని అంటున్నారు. వారి కీలక డిమాండ్ల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలోకి రాక ముందు చెప్పిందేమిటి, వచ్చాక చేసింది ఏమిటి అన్న తేడా వారికి స్పష్టంగా అవగాహన ఉందని అంటున్నారు.

అదే టైంలో ఉద్యోగుల అతి ముఖ్యమైన డిమాండ్ సీపీఎస్ రద్దు మీద ఈసారి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడేందుకే సాహసించలేదు. మరో వైపు చూస్తే కొత్త పీఆర్సీ విషయంలో పార్టీలు సానుకూలంగా మాట్లాడుతున్నా కూడా రేపు అధికారంలోకి వచ్చాక ఎంత వరకూ నెరవేరుస్తాయన్నది డౌటే అన్న భావన కూడా ఉంది అంటున్నారు.

ఇంకోవైపు చూస్తే అటు అధికార వైసీపీ ఇటు టీడీపీ కూటమి కూడా ఒకరిని మించిన తీరులో మరొకరు సంక్షేమ పధకాలను ప్రకటించారు. ఖజనా పరిస్థితి ఏమిటో ఉద్యోగులకు మాత్రమే తెలుసు. ఏ మాత్రం తేడా వచ్చినా మొదట తమ జీతాలకే కోత పెడతారని కూడా ఇంకా బాగా తెలుసు. ఆ మీదట జీతాల కోసమే పోరాటం తప్ప ఇతర ఆర్ధిక డిమాండ్లు అసలు నెరవేరవని కూడా సగటు ఉద్యోగులకు తెలుసు.

ఇన్ని తెలిసిన తరువాత వారు ముచ్చటగా మూడవసారి విభజన ఏపీలో ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని రావాలని అనుకుంటున్నారు అన్నదే ఉత్కంఠను రేకెత్తించే విషయంగా ఉంది. మొత్తం మీద ఉద్యోగుల ఓట్లు ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయని అంటున్నారు. మామూలు ఓట్లటో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది.

కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద యాభై పాతిక పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. దాంతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది. ఉద్యోగులు కూడా ఈసారి నూటికి నూరు శాతం ఓట్లు వేయడానికే మొగ్గు చూపించడం మారుతున్న రాజకీయానికి కొత్త మలుపు అని అంటున్నారు.

Tags:    

Similar News