బీజేపీ కొంప ముంచనున్న ప్రజ్వల్ !?

2019 ఎన్నికల్లో ఈ 14 సీట్లకు గానూ మొత్తం సీట్లను బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి బీజేపీని దెబ్బ కొట్టేలా ప్రజ్వల్ వ్యవహారం ఉంది.

Update: 2024-05-08 03:30 GMT

కన్నడ నాట బీజేపీకి రెండంకెల ఎంపీలు సీట్లు దక్కుతాయని ఒక అంచనా ఉంది. మొత్తం సౌత్ ఇండియాలో బీజేపీకి పట్టుమని పది సీట్లు ఇచ్చే స్టేట్ ఏదీ లేదు. టోటల్ దక్షిణాదిలో బీజేపీకి తెలంగాణాలో కొంత హోప్స్ ఉన్నాయి. ఏపీలో కూటమి కట్టింది. కానీ బీజేపీకి రెండు ఎంపీ సీట్ల కంటే ఆశలు లేవు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా తమిళనాడు కేరళలలో ఈసారి బోణీ బాగుంటే ఓకే. కానీ ఎక్కువ సీట్లు కర్నాటకలో రావాలి. అక్కడ జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలలు ఒకసారి బయటపడి బీజేపీకి బిగ్ ట్రబుల్ ఇస్తున్నాయి. బీజేపీకి దెబ్బేసే అవకాశాలు ఇక్కడే ఉన్నాయి అంటున్నారు.

ఇక మంగళవారం కర్నాటకలో చివరి విడత అంటే మొత్తం 28 ఎంపీ సీట్లలో మిగిలిన 14 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలకు కోటి ఆశలు పెట్టుకున్న బీజేపీ ఇపుడు కలవరపడుతోంది. 2019 ఎన్నికల్లో ఈ 14 సీట్లకు గానూ మొత్తం సీట్లను బీజేపీ గెలుచుకుంది. కానీ ఈసారి బీజేపీని దెబ్బ కొట్టేలా ప్రజ్వల్ వ్యవహారం ఉంది.

ఇదంతా జేడీఎస్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చింది. ఆ పార్టీకి బీజేపీ ఇచ్చిన ఎంపీ సీట్లు మూడే. అందులో ప్రజ్వల్ పోటీ చేస్తున్న హాసన్ ఎంపీ సీటుతో పాటు జేడీఎస్ పోటీలో ఉన్న మిగిలిన రెండింటికీ కూడా ఏప్రిల్ 26న తొలి విడత పోలింగ్ లోనే పూర్తి అయ్యాయి. అంటే ప్రజ్వల్ మీద సెక్స్ రాకెట్ ఆరోపణలు వచ్చేనాటికి ఆయన సిట్టింగ్ సీటులో కూడా జనాలు ఓటేసారు. అలా ఆయన కూడా సేఫ్.

ఇక ఇపుడు రెండవ విడతలో టోటల్ సీట్లు అన్నీ బీజేపీ మాత్రమే ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ సీట్లను సోలోగా గెలుచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ తో ముఖా ముఖీ తలపడింది. ఇక పోలింగ్ జరిగిన ఎంపీ సీట్లలో ఎక్కువ భాగం ఉత్తర సెంట్రల్ కర్నాటక ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వెనకబడిన ప్రాంతం అయిన కళ్యాణ కర్నాటక ఉన్నాయి. ఇక్కడ లింగాయత్ సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉంది. అలాగే చిక్కోడి, బెలగావి, బాల్కోటే, ఉత్తర కన్నడ, బీదర్, రాయచూర్, బళ్లారి, కొప్పల, విజయపుర, కలబురిగి, దావణ గెరె, శివమొగ్గ, హావేరి, ధారవాడ నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది.

దాంతో ప్రజ్వల్ ప్రభావం ఆ కోపాగ్నికి కమలం వాడిపోయే సూచనలు ఇక్కడే కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి ఈ తప్పు బీజేపీది కాదు, జేడీఎస్ ది. ఆ పార్టీ ముఖ్య నేత ప్రజ్వల్ ది. ఆయన బాబాయ్ కుమారస్వామి పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సొంత తండ్రి రేవణ్ణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ తప్పు జరిగితే ఫలితం జేడీఎస్ అనుభవించాలి. కానీ చిత్రంగా జేడీఎస్ మొదటి విడత ఎన్నికలతో ఒడ్డున పడిపోయింది. పొత్తు పెట్టుకున్న పాపానికి బీజేపీ అడ్డంగా బుక్ అయింది.

ఈసారి జేడీఎస్ పొత్తుతో 14 ఎంపీ సీట్లను మళ్ళీ గెలుచుకుని గత మ్యాజిక్ ని రిపీట్ చేద్దామని బీజేపీ పడుతున్న తాపత్రయం కాస్తా ప్రజ్వల్ ఎపిసోడ్ తో ఇబ్బందిలో పడింది అని అంటున్నారు. ఈ కోపాగ్ని జనంలో ఒక రేంజిలో ఉంది. వారు తమ ఓటుతో దెబ్బ తీసేది బీజేపీనే అని విశ్లేషణలు ఉన్నాయి. మరి బీజేపీకి ప్రజ్వల్ ఎంత మేరకు నష్టం చేస్తాడు అన్నది జూన్ 4న వచ్చే ఫలితం చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News