న్యాయపరమైన చిక్కుల్లో ప్రకాష్ రాజ్! చంద్రయాన్-3 పై కామెంట్ ఫ‌లితం!!

పిటిఐ కథనం ప్రకారం.. ''చంద్రయాన్ -3 మిషన్ పై నాశిర‌కం వ్యంగ్య‌ పోస్ట్ చేసినందుకు నటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు నమోదైంది.

Update: 2023-08-23 13:30 GMT

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మూన్ మిషన్ 'చంద్రయాన్-3'పై మీమ్‌ను షేర్ చేసినందున ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్‌పై కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విల‌క్ష‌ణ నటుడిపై మంగళవారం బాగల్‌కోట్ జిల్లా బనహట్టి పోలీస్ స్టేషన్‌లో హిందూ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. పిటిఐ కథనం ప్రకారం.. ''చంద్రయాన్ -3 మిషన్ పై నాశిర‌కం వ్యంగ్య‌ పోస్ట్ చేసినందుకు నటుడు ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు నమోదైంది. హిందూ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు'' అని తెలిపారు.

అంతకుముందు ప్రకాష్ రాజ్ చొక్కా - లుంగీలో ఛాయ్ వాలా 'టీ'ని ఒంపుతున్న వ్యక్తి తాలూకా వ్యంగ్య ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేసారు. ఈ ఫోటోకి వ్యాఖ్య‌ను జోడిస్తూ-''చంద్రయాన్ నుండి మొదటి వీక్షణ వచ్చింది .. #VikramLander #justasking.'' అంటూ కామెంట్ చేసాడు. చంద్రుడిపై తొలిసారిగా నడిచిన వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇస్రో చంద్రయాన్-3 మిషన్ ను అగౌరవపరిచేలా వ్యాఖ్యానించారు.

"ద్వేషం ద్వేషాన్ని మాత్రమే చూస్తుంది.. నేను #ఆర్మ్‌స్ట్రాంగ్ టైమ్‌లోని ఒక జోక్‌ని సూచిస్తున్నాను.. మన కేరళ చాయ్‌వాలాని సెలబ్రేట్ చేస్తున్నాను.. ఏ చాయ్‌వాలాను ట్రోల్స్ చేశారు ?? .. మీకు జోక్ రాకపోతే జోక్ మీపైనే ఉంటుంది.. ఎదగండి" అని ప్ర‌కాష్ రాజ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌లో రాశారు. అనంత‌రం నెటిజ‌నులు ప్ర‌కాష్ రాజ్ తీరును తూర్పార‌బ‌ట్టారు. ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టుపై ఇలాంటి కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు.

ఇస్రోను కానీ చంద్రయాన్-3 మిషన్‌ను కానీ అగౌరవపరచడం తన ఉద్దేశ్యం కాదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఆ మీమ్ కేవలం జోక్ మాత్రమేనని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని అన్నారు. కానీ ఇప్పుడు అత‌డిని కొంద‌రు కోర్టుకీడుస్తున్నారు.

Tags:    

Similar News