ప్రశాంత్ కిషోర్... 'ఏ బిగ్ డిబేట్'!
రాజకీయ వ్యూహకర్త(ఇప్పుడు చేయడం లేదు) ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు
రాజకీయ వ్యూహకర్త(ఇప్పుడు చేయడం లేదు) ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఒకప్పుడు ఆయన చెప్పిన ప్రతిమాటకూ ఎంతో విశ్వసనీయత ఉండేది. 2014లో మోడీకి పనిచేసినప్పుడు .. 2019లో జగన్‌కు పనిచేసినప్పుడు.. తర్వాత. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి పనిచేసినప్పుడు కూడా.. ప్రశాంత్ కిషోర్ అంటే.. ఒక నమ్మకం- ఒక విశ్వసనీయతకు మారు పేరు అన్నట్టుగా ఉండేది. తర్వాత కాలంలో ఆయన వేసిన అడుగులు... ఇబ్బందిగా అనిపించాయి.
ముఖ్యంగా గోవా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో జట్టుకట్టిన ప్రశాంత్ కిషోర్.. కొన్ని రోజులు పనిచేశారు. కానీ.. పార్టీలో కీలక పదవిని ఆయన ఆశించడం.. దానిని ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేయక పోవడంతో బయటకు వచ్చారు. ఇదేసమయంలో కాంగ్రెస్‌పై ఆయన నిప్పులు చెరిగారు. ఎప్పటికీ కాంగ్రె స్ పుంజుకోదన్నారు. ఈ క్రమంలోనే.. గత ఏడాది హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ.. కాంగ్రెస్ గెలవదని చెప్పుకొచ్చారు. కానీ.. ఆయన చేసిన ప్రిడిక్షన్ విఫలమైంది.
ఇక, ఇప్పుడు పరిస్థితిని గమనిస్తున్నా.. తనకు నచ్చని వారిని.. ఆయన విభేదిస్తున్నారు. పోనీ.. నచ్చిన వారికి అయినా.. సంపూర్ణంగా పనిచేస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. తాజాగా ప్రముఖ మీడియా ఛానె ల్ లో ఆయన చేసిన వాదన.. ఎదురుదాడి వంటివి ఎక్కడో ఆయనలో ఉన్న అపనమ్మకాన్ని.. ఆత్మన్యూ నతా భావనను తెరమీదికి తెచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన విషయాన్ని ఆయన మరిచిపోయినట్టుగా ఉన్నారు. కానీ, ఇక్కడ కాంగ్రెస్ అదికారంలోకి వచ్చింది.
ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఆయన రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. జగన్ సీట్లు తగ్గుతాయని.. ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. కేవలం ఇవ్వడం వరకే పరిమితమైన.. జగన్‌ను ఈసారి ఓడిస్తా రని అంటున్నారు. ఈ విషయాన్ని కార్నర్ చేస్తూ.. ఒక జర్నలిస్టు.. ఆయా పథకాలను ప్రచారం చేయిం చింది.. నవరత్నాలు కాన్సెప్టును తీసుకువచ్చింది .. మీరే కదా.! అన్న ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ దగ్గర సమాధానం లేదు. పైగా.. ఇక్కడ కూడా ఎదురు దాడే చేశారు.
నేను చెప్పింది నిజం కాకపోతే.. నా మొహాన పేడ కొట్టండి! అని అసహనం ప్రదర్శించారు. నిజానికి ఆయ న వ్యూహకర్త ఉద్యోగం నుంచి తప్పుకొన్నారు. జనసురాజ్ పార్టీ పెట్టుకుని బిహార్‌లో పాదయాత్ర కూడా చేశారు. మరోవైపు పరోక్షంగా బీజేపీని సమర్ధిస్తున్నారు. ఇంకోవైపు ప్రాంతీయ పార్టీలతో విభేదాలు పెంచుకుంటున్నారు. దీంతో మొత్తంగా ప్రశాంత్ కిషోర్ ఇమేజ్.. ఒక పెద్ద చర్చ(బిగ్ డిబేట్)గా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు.