అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్... 2500 రకాల వంటకాలు..!
ఈ క్రమంలో తాజాగా ఆ వేడుకకు హాజరయ్యే అతిథులకు వడ్డించే వంటకాలు, అందులోని రకాలు, మొదలైన విషయాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఆ విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
సాధారణంగా సెలబ్రెటీల ఇంట పెళ్లి వేడుకలు అంటే.. అక్కడ జరిగే ప్రతీ ఏర్పాటు, ప్రతీ విషయమూ ఆసక్తికరంగానే ఉంటుంది! వివాహ పత్రికల డిజైన్ నుంచి, వివాహ వేదిక, అంతకు ముందు జరిగే సంగీత్ వేడుక, అనంతరం జరిగే రిసెప్షన్.. ఇక వారు ధరించే దుస్తులు, అలంకరించుకునే నగలు, వచ్చే అతిధులు, వారు తెచ్చే బహుమతులు, విందులో వడ్డించే వంటకాలు... ఒక్కటేమిటి ప్రతీదీ ప్రత్యేకంగానే ఉంటుంది!
ఇక భారతదేశంలోని అపర కుబేరుడు అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే అది ఏ రేంజ్ లో ఉంటుంది? అందుకే... గతకొన్ని రోజులుగా అంబానీ ఇంట జరిగే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమానికి సంబంధించి రోజుకో కొత్త విషయం, ప్రత్యేకమైన విషయం తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వేడుకకు హాజరయ్యే అతిథులకు వడ్డించే వంటకాలు, అందులోని రకాలు, మొదలైన విషయాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఆ విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... మూడు రోజుల పాటు జరిగే అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యే అతిథుల కోసం ఏకంగా 2,500 రకాల వంటకాలను వడ్డించనున్నారంట. ఇదే క్రమంలో ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి వడ్డించకుండా.. ఆ అవసరం లేకుండా.. భారీ ఎత్తున విందు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఈ మేరకు తయారవుతున్న ప్రత్యేక మెనూ కోసం మద్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి 21 మంది చెఫ్ లను పిలిచినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే అతిథుల కోసం భారతీయ వంటకాలతో పాటు మెక్సికన్, థాయి, జపనీస్, పార్సీ, మొదలైన పలు సంప్రదాయ వంటలను రుచి చూపనున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మొత్తంగా 2,500 వంటకాలను వడ్డించనున్నారని సమాచారం!
ఈ క్రమంలో బ్రేక్ ఫాస్ట్ లో 75 వెరైటీలు, మధ్యాహ్నం భోజనంలో 225 వెరైటీలు, ఇక డిన్నర్ లో 275 రకాల వంటకాలను వడ్డించనున్నారని తెలుస్తుంది. వీటితో పాటు మిడ్ నైట్ స్నాక్స్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకూ కూడా అతిథులు ఏది కోరుకుంటే అది అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని తెలుస్తుంది.
కాగా... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ కు.. ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. జూలైలో వీరి వివాహం జరగనుండగా... మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించనున్నారు.