మోడీ కి దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చిన ప్రియాంక గాంధీ !

ఈ సమయంలో... లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ప్రచార సభలో ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-24 05:42 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు రాజకీయ వాతావరణాన్ని సెగలు కక్కించేసేలా చేస్తుంది. ఈ సమయంలో... లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో నిర్వహించిన ప్రచార సభలో ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి!

అవును... లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలూ వారి వారి ప్రచార కార్యక్రమాలను పీక్స్ కి తీసుకెళ్తున్నాయి. ఈ సమయంలో తాజాగా యుద్ధం సమయంలో ఇందిరా గాంధీ తన బంగారాన్ని విరాళంగా ఇచ్చేశారని గుర్తు చేసిన ప్రియాంక గాంధీ... తన తల్లి (సోనియా గాంధీ) దేశం కోసం మంగళసూత్రం త్యాగం చేశారని రాజీవ్‌ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దీంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రధానంగా... ప్రజల వద్ద ఉన్న బంగారం సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తుందని, ఈ విషయంలో మహిళల మంగళ సూత్రాలనూ వదలదంటూ కాంగ్రెస్‌ పై ప్రధాని మోడీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదే సమయంలో మంగళసూత్రం ప్రధాన్యాన్ని మోడీ అర్ధం చేసుకుని ఉంటే అలా అనైతికంగా మాట్లాడేవారు కాదంటూ ఘాటుగా స్పందించిన ప్రియాంక... భారత్‌ గత 75 ఏళ్లుగా స్వేచ్ఛగా ఉంది.. అందులో 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. ఆ సమయంలో మీ మీ బంగారాన్ని, మంగళసూత్రాన్ని ఎప్పుడైనా లాక్కుందా? అంటూ ప్రజలను ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... చిత్రదుర్గ్‌ లో నిర్వహించిన సభలోనూ ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోనే అతి పెద్ద నాయకుడైన ఆయన నైతికతను వదిలేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల గొంతును నొక్కేందుకే మోడీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విపక్షాల బ్యాంకు ఖాతాలను నిలిపివేసి, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని జైలుపాలు చేసిందని తెలిపారు!

Full View
Tags:    

Similar News