అగ్రరాజ్యంలో వాడి గన్ కు 2 రోజుల్లో 8 మంది బలి

తాజాగా అమెరికాలోని ఒక రాష్ట్రంలో వెనుకా ముందు చూసుకోకుండా ఒక సైకో జరిపిన కాల్పుల్లో 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-01-23 05:02 GMT

తాజాగా అమెరికాలోని ఒక రాష్ట్రంలో వెనుకా ముందు చూసుకోకుండా ఒక సైకో జరిపిన కాల్పుల్లో 8 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆందోళన కలిగించే విషయం వాడ్ని పోలీసులు ఇంకా పట్టుకోకపోవటం. అతగాడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ మరోసారి వార్తల్లోకి ఎక్కేలా చేసింది. గన్ కల్చర్ కారణంగా భారీగా ప్రాణాలు పోతున్న వైనం తెలిసిందే. తాజాగా ఒకడు రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మందిని గన్ తో కాల్పులు జరిపి వారి ప్రాణాలు తీసిన వైనం సంచలనంగా మారింది.

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని జోలియెట్ పట్టణంలో ఆది.. సోమవారాల్లో ఒక సైకో జరిపిన కాల్పులకు ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. రెండు వేర్వేరు ఇళ్లల్లో ఈ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అతగాడు బలి తీసుకున్న వారు అతడికి తెలిసిన వారే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన ఈ సైకోను రోమియో నాన్స్ గా గుర్తించారు.

తనకు పరిచయం ఉన్న వారినే అతగాడు చంపేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటకు రావాల్సి ఉంది. ఆదివారం నుంచే అతగాడు కాల్పులకు పాల్పడుతున్నా.. సోమవారం నాటికి కానీ అతడి దుశ్చర్యను పోలీసులు గుర్తించగలిగారు. రెడ్ కలర్ టయోటా కారులో తప్పించుకు తిరుగుతున్న ఇతడితో పాటు మరణాయుధాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అతడి గురించి సమాచారం ఎవరికైనా తెలిసి ఉంటే.. వెంటనే తమకు తెలపాలంటూ పోలీసులు కోరుతున్నారు. ఈ సైకోను పట్టుకోకుంటే మరిన్ని ప్రాణాలకు ముప్పు ఖాయం.

Tags:    

Similar News