పురంధేశ్వరికి రాజమండ్రి సీటు వెరీ టఫ్...!?

రాజమండ్రి సీటు నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు.

Update: 2024-03-26 03:55 GMT

రాజమండ్రి సీటు నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఆ మేరకు బీజేపీ అధినాయకత్వం ఆమెను సెలెక్ట్ చేసి సీటు చూపించింది. నిజానికి పురంధేశ్వరి కోరుకున్న సీటు ఇది కాదు. ఆమె విశాఖ సీటు మీద మనసు పడ్డారు.

విశాఖలో అయితే బీజేపీకి బలం ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఉత్తరాది వారి జనాభా అధికంగా ఉంది. పైగా గతంలో గెలిచిన సీటు అది. దాంతో బీజేపీ ఏపీ చీఫ్ గా తాను అక్కడ నుంచే పోటీ చేయాలని ఆమె భావించారు.

ఇక పురంధేశ్వరి 2009లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ఆ సెంటిమెంట్ వర్తిస్తుంది అని అనుకుంటే హై కమాండ్ మాత్రం ఆమెకు రాజమండ్రి ఇచ్చింది. అయితే రాజమండ్రిలో ఆమె గెలుపు అనుకున్నంత సులువు కాదు అని అంటున్నారు. ఎందుకంటే ఆమె నాన్ లోకల్ అన్న ప్రచారం మొదలైంది. పైగా ఆ సీటుని బీజేపీకి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజు కోరుకున్నారు. ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పి బీజేపీ పెద్దలు చిన్నమ్మను అక్కడ దింపారు

దాంతో సోము వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయనకు సీటు కేటాయించకపోవడం పట్ల ఆ సామాజిక వర్గంలోనూ బాధ వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. ఇక టీడీపీలో చూస్తే బొడ్డు వెంకట రమణ చౌదరి, అలాగే గన్ని క్రిష్ణ కూడా ఇదే సీటు ఆశించారు. వెంకట రమణ చౌదరి అయితే రాజానగరం మీద మొదట ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఆ సీటుని జనసేనకు అప్పగించారు. ఆనాడు ఎంపీ సీటు ఇస్తామని చెప్పారు. తీరా చూస్తే అదీ పోయింది. దాంతో బొడ్డు వర్గం మండిపోతోంది.అదే విధంగా గన్ని క్రిష్ణ కూడా ఉన్నారు. ఇలా సొంత పార్టీలో మిత్రపక్షంలో కూడా ఇదే రకంగా అసంతృప్తి రాగాలు ఉన్నాయని అంటున్నారు.

రాజమండ్రిలో పురంధేశ్వరికి బేస్ ఏదీ లేదని అంటున్నారు. బీజేపీకి పట్టు అంతంత మాత్రం అంతున్నారు. పూర్తిగా జనసేన టీడీపీ మీదనే ఆధారపడాల్సి ఉంది అంటున్నారు. మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లలో అయిదు టీడీపీ పోటీ చేస్తూంటే రెండు చోట్ల జనసేన ఉంది. అందరినీ కలుపుకుని ముందుకు పోవాల్సి ఉంది. అదే విధంగా ఈసారి గెలవడం ఆమెకు తప్పనిసరి అని అంటున్నారు. ఆమె రాజెకీయ జీవితానికి కీలక మలుపు కూడా ఈ ఎంపీ సీటులో గెలుపు అని అంటున్నారు. మరి ఎలా అన్నీ సర్దుకుంటాయంటే చంద్రబాబు జోక్యం చేసుకుంటేనే తప్ప ఏదీ కుదరదు అని అంటున్నారు.

Tags:    

Similar News