మా డిమాండ్‌తోనే పీవీకి భారత రత్న: కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ ప్రదాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. పూర్వ ప్రధాని, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డును ప్రకటించడంపై తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇది తమ ఘనతేనని చెప్పుకొచ్చారు. తాము డిమాండ్ చేయబట్టే.. పీవీకి భారతరత్న ప్రకటించారని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రదాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదు.. తాము ఎప్పటి నుంచో పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతున్నట్టు బీఆర్ ఎస్ తెలిపింది. పీవీ శతజయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించామని బీఆర్ ఎస్ పేర్కొంది. అప్పట్లోనే సభలో తీర్మా నం చేసి కేంద్రానికి పంపించామని.. దాని ఫలితంగానే ఇప్పుడు పీవీకి భారతరత్న దక్కిందని బీఆర్ ఎస్ వెల్లడించింది. ఏదేమైనా పీవీకి భారతరత్న ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.
ఇదిలావుంటే.. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్‌కు సైతం భారత రత్న ఇవ్వాలం టూ.. నెటిజన్లు కోరడం గమనార్హం. ఆయన అన్నివిధాలా భారత రత్నకు అర్హుడని పేర్కొంటున్నారు. అదేవిధంగా మాజీ ప్రధాని.. కాంగ్రెస్ నేత, మన్మోహన్ సింగ్కు కూడా.. భారత రత్న ఇవ్వాలంటూ.. యూపీ వాసులు కోరుతున్నారు. ఆయన ఈ దేశానికి చేసిన సేవలను గుర్తించాలని సోషల్ మీడియాలో కోరుతుండడం గమనార్హం.