రాహుల్ గాంధీకి పెళ్లిచేద్దామంటున్న సోనియా... వీడియో వైరల్!

హరియాణా నుంచి ఢిల్లీ వచ్చిన ఆ మహిళలు ముందుగా దేశరాజధానిలోని పలు ప్రాంతాలను సందర్శించారు

Update: 2023-07-29 08:15 GMT

భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లోనూ ఎలిజిబుల్ బ్యాచులర్స్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్.. ఏజ్డ్ బ్యాచులర్స్ చాలా మందే ఉన్న సంగతి తెలిసిందే. పెళ్లికాని ప్రసాదులంతా సందర్భం వచ్చిన ప్రతిసారీ ఈ సెలబ్రెటీలను ప్రస్థావించి దాటేస్తుంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది.

అవును... కాంగ్రెస్‌ అగ్రనేత, రాహుల్ గాంధీ ఇప్పటికీ బ్యాచ్ లర్ గానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు.. సోనియా గాంధీ తో మాట్లాడుతూ రాహుల్‌ వివాహం గురించి అడిగారు. ఈ సందర్భంగా సోనియా... ఆసక్తికరమైన సామాధానం చెప్పారు.

ఈ నెల ఆరంభంలో రాహుల్‌గాంధీ హరియాణాలో పర్యటించిన సమయంలో.. సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులను కలిసి ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారంతా.. ఢిల్లీకి రావాలని ఉందని రాహుల్ తో చెప్పారు. దాంతో ఆయన వారిని సోనియా నివాసానికి ఆహ్వానించగా.. ఇటీవల ఆ మహిళలంతా వెళ్లారు.

దీనికి సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్‌ తాజాగా షేర్‌ చేశారు. హరియాణా నుంచి ఢిల్లీ వచ్చిన ఆ మహిళలు ముందుగా దేశరాజధానిలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం 10 జన్‌ పథ్‌ లోని సోనియా నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ మహిళా రైతులను గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది.

అనంతరం సోనియా, ప్రియాంక, రాహుల్‌... మహిళలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ సోనియా గాంధీ చెవిలో.. "రాహుల్‌ కు పెళ్లి చేద్దామా?" అని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. "మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి" అని అన్నారు. దీత్మో... రాహుల్‌ నవ్వుతూ.. "అవుతుంది.. అవుతుంది" అని చెప్పారు. దీంతో ఆ ప్రాంతమంతా నవ్వులతో నిండిపోయింది!

ప్రస్తుతం ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా గాంధీ ఫ్యామిలీ.. ఆ మహిళా రైతులతో గడిపిన ఆ సమయంపైనా, రైతులపై వారు చూపించిన ఆత్మీయతపైనా ఆన్ లైన్ వేదికగా రాహుల్ ని అభినందిస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.


Full View


Tags:    

Similar News