రాహుల్ కు ఎదురీత.. వయనాడ్‌లో కూటమి కుంపటి!
దీనికి కారణం.. మరోసారి రాహుల్ గాంధీ వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగుతుండడమే.
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ప్రస్తుత ఎంపీ రాహుల్‌గాంధీకి సొంత మిత్ర పక్షాలతోనే పెద్ద ఇబ్బంది ఎదురవుతోంది. ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలు.. కాంగ్రెస్‌తో పనిచేయాల్సి ఉంది. ఇది పలు రాష్ట్రాల్లో సీట్లు పంచుకునేలా కూడా చేసింది. ఈ కూటమిలో వామపక్షాలు కూడా ఉన్నాయి. అయితే.. ఎక్కడైనా.. ఓకే కానీ.. మా కేరళలో మాత్రం కుదరదని.. తేల్చి చెప్పింది.. సీపీఐ. దీనికి కారణం.. మరోసారి రాహుల్ గాంధీ వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీకి దిగుతుండడమే.
గత 2019 ఎన్నికల సమయంలో వయనాడ్ టికెట్‌ను.. సీపీఐ స్వయంగా రాహుల్‌కు ఇచ్చింది. ఆయనను అక్కడ నుంచి గెలిపించడంలోనూ కీలక పాత్ర పోషించింది. దీంతో అమేథీలో రాహుల్ ఓడిపోయినా.. ఇక్కడ గెలవడం ద్వారా పార్లమెంటులో అడుగులు వేశారు. కానీ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అసలు అమేథీలో రాహుల్ పోటీ చేయడమే లేదు. పూర్తిగా వయనాడ్‌పైనే దృష్టి పెట్టారు. ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అలాగే చేస్తున్నారు.
కానీ.. ఈ దఫా తమ టికెట్‌లో తామే పోటీ చేస్తామని చెప్పిన సీపీఐ.. అన్నంత పనీ చేసింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డీ . రాజా సతీమణి.. అన్నీ రాజా వయనాడ్ నుంచి బరిలో ఉన్నారు. పోనీ.. కాంగ్రెస్ వామపక్షాల మధ్య బెడిసి కొట్టిందా? అంటే లేదు. మిత్రపక్షంగానే ఉన్నారు. కానీ, కేరళలో మాత్రం కాదు. అందునా.. వయనాడ్‌లో అసలే కాదు. దీంతో రాహుల్‌కు మిత్ర పక్షం సీపీఐ నుంచే వయనాడ్‌లో బలమైన పోటీ ఎదురైంది.
పైగా.. మహిళా సంఘాల నాయకురాలిగా అన్నీరాజాకు మంచి పేరుంది. మహిళా సెంటిమెంటు కూడా.. కలిసి వస్తోంది. దీంతో రాహుల్.. పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్టుగా మారిపోయింది. గత ఎన్నికల్లో నల్లేరుపై నడకే అయినా.. ఇప్పుడు మాత్రం వయనాడ్‌లో ఆపశోపాలు పడుతున్నారు. ఇక, బీజేపీ కూడా సుందరేశన్ అనే.. బీజేపీ చీఫ్‌ను నిలబెట్టింది.(ఏపీలో పురందేశ్వరి మాదిరిగా) దీంతో పోటీ త్రిముఖ పోరుగా ఉండడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి రాహుల్ నెగ్గుతారో లేదో చూడాలి.