తెలంగాణలోనూ ఓ ''ఆర్ఆర్ఆర్''.. ఆయన చాలా పెద్దాయనే
అంతెందుకు.. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం కూడా పొందింది. అలా ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలిచిపోయింది.
ఆర్ఆర్ఆర్.. నాలుగేళ్లుగా భారత దేశంలో మార్మోగుతున్న పేరు ఇది. తెలుగు టాప్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను ముందుపెట్టి ‘రణం రుధిరం రౌద్రం’ (ఆర్ఆర్ఆర్) అంటూ దర్శక ధీరుడు రాజమౌళి తీసిని సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరూ చూశారు. అంతెందుకు.. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారం కూడా పొందింది. అలా ఆర్ఆర్ఆర్ చరిత్రలో నిలిచిపోయింది.
ఏపీలో ఆర్ఆర్ఆర్
ఏపీ రాజకీయాల్లో ఆర్ఆర్ఆర్ గా అందరికీ సుపరిచితం అయ్యారు రఘరామక్రిష్ణం రాజు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా వైసీపీ తరఫున ఎన్నికయిన ఆయన కొంతకాలానికే ఆ పార్టీ అధినేత, అప్పటి సీఎం జగన్ పై తిరుగుబాటు చేశారు. రోజూ రచ్చబండ పేరిట మీడియా ముందుకు వచ్చి జగన్ ప్రభుత్వ లోపాలను ఎండగట్టేవారు. తనను అరెస్టు చేసి తీవ్రంగా కొట్టినా ఈ ఆయన తన పంథా వీడలేదు. చివరకు ఇటీవలి ఎన్నికల్లో ఉండి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. రాబోయే మంత్రివర్గంలో చోటు దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
తెలంగాణలో ఈయన
లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా రామసహాయం రఘురామిరెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఆయన ఎవరో కాదు.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సినీ హీరో విక్టరీ వెంకటేష్ లకు వియ్యంకులు. డోర్నకల్ భూస్వామిగా పేరు పడ్డ వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి (ఆర్ఎస్) కుమారుడే ఈయన. కాగా,ఇప్పుడు రామసహాయ రఘురామి రెడ్డిని కూడా ఆర్ఆర్ఆర్ గా సంబోధిస్తూ వస్తున్నారు. ఆ మేరకు పేపర్ అడ్వర్టయిజ్ మెంట్స్ ఇస్తున్నారు.
సినిమా పాపులర్ తో..
ఆర్ఆర్ఆర్ సినిమా పాపులర్ కావడంతో అది కలిసివచ్చేలా ఆర్ఆర్ఆర్ అని నాయకులు పేరు పెట్టుకుంటున్నారు. అందరికీ తెలిసినవారు మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రఘురామ, ఖమ్మం తాజా ఎంపీ రఘురామిరెడ్డి మాత్రమే. ఇంకెందుకు ఇలా తమ పేరును ఆర్ఆర్ఆర్ గా కుదించుకున్నారో?