సాల్ట్ నుంచి సాఫ్ట్ వేర్ వరకు.. టాటానే

దేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అయినప్పటికీ ఎవరికి దక్కని ఒక ట్యాగ్ రతన్ టాటా..

Update: 2024-10-10 04:59 GMT

దేశంలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అయినప్పటికీ ఎవరికి దక్కని ఒక ట్యాగ్ రతన్ టాటా.. ఆయనకు చెందిన టాటాకు ఉంది. అదే.. విశ్వసనీయత. పూర్తి దేశీయ బ్రాండ్. ఏదైనా విదేశీ బ్రాండ్ తో పోటీ పడాల్సి వస్తే.. అంతిమంగా టాటా ప్రొడక్టుకు ఓటేస్తారు. అంతలా భారతీయుల మనసుల్ని కనెక్టు చేయటంలో రతన్ టాటా మేజిక్ కనిపిస్తుంది. ఆయన వ్యాపార విశ్వరూపం చూస్తే వావ్ అనాల్సిందే. ఒక పారిశ్రామికవేత్త నిత్యం తన వ్యాపారం గురించి.. వ్యాపార సంస్థ గురించి ఆలోచిస్తూ.. దాని మీదనే పని చేస్తే.. ఆ సంస్థను ఏ స్థాయికి తీసుకెళ్లొచ్చు..? ఎంతలా విస్తరించొచ్చున్న దానికి నిదర్శనంగా రతన్ టాటా కనిపిస్తారు.

వంటింట్లో ఉప్పు మొదలుకొని ఐటీ రంగం వరకు.. అది ఇది అన్న తేడా లేకుండా ప్రతి రంగంలోనూ టాటా ముద్ర పడేలా చేయటంలో రతన్ టాటా దార్శనికత ఉందని చెప్పాలి. కొన్ని వందశాతం వాటా.. మరికొన్నింట్లో వాటాలున్నప్పటికీ.. తాము ఎంట్రీ ఇచ్చిన ప్రతి సంస్థలోనూ తమదైన మార్కు వేయటంలో రతన్ టాటా విజన్ కనిపిస్తుంది. రతన్ టాటా ఆధ్వర్యంలో ఎదిగిన టాటా గ్రూప్ ను.. ఆయన వ్యాపార విశ్వరూపాన్ని సంక్షిప్తంగా చూస్తే..

- వినియోగ ఉత్పత్తులు

వోల్టాస్, టాటా ప్రవర్షి


- ఆర్థికం

టాటా ఏఐజి లైఫ్,టాటా ఏఐజి,టాటా క్యాపిటల్,టాటా అసెట్ మేనేజ్ మెంట్, టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్


- ఎఫ్ఎంసీజీ (కన్స్యూమర్ ప్రొడక్ట్స్)

టాటా కన్స్యూజమర్ ప్రొడక్ట్స్, టాటీ మైబిస్ట్రో, టాటా స్టార్ బక్స్


- టూరిజం అండ్ జర్నీ

ఇండియన్ హోటల్ కంపెనీ, తాజ్ హోటల్స్, వివంత, అల్లం, తాజ్ ఎయిర్, ఎయిరిండియా, విస్తారా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, ఎయిర్ ఏషియా


- టెలికాం అండ్ మీడియా

టాటా కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్,  టాటా ప్లే,


- ఏరోస్పేస్ & డిఫెన్స్

టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్


- లెదర్ ఉత్పత్తులు & గ్లోబల్ ట్రేడింగ్

టాటా ఇంటర్నేషనల్ గ్రూప్, లెదర్ ఉత్పత్తులు, గ్లోబల్ ట్రేడింగ్, ఫీట్ సైన్స్& టాగ్రా


- ఐటీ రంగం

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటా ఎల్క్సీ, నెల్కో లిమిటెడ్


- స్టీట్ రంగం

టాటా స్టీల్,  ఇందులో టాటాకు చెందిన పలు విదేశీ సంస్థలు కూడా ఉన్నాయి (టాటా స్టీల్ నెదర్లాండ్స్, టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ థాయిలాండ్, టాటా రాబిన్స్ ఫ్రేజర్ లిమిటెడ్, జంక్షన్ తదితరాలు)


- ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్

టాటా ఎలక్ట్రానిక్స్, టాటా పవర్ (ఇందులో బోలెడు కంపెనీలు ఉన్నాయి. ఇందులో పరిమిత వాటా ఉంది. ఉదాహరణకు టాటా పవర్ సోలార్, నెల్కో లిమిటెడ్, మైథాన్ పవర్, టాటా పవరర్ ఢిల్లీ డిస్ట్ లిమిటెడ్ తదితరాలు)


- ఇంజనీరింగ్ & కన్ స్ట్రక్షన్

టాటా ప్రాజెక్ట్స్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్


- రియల్ ఎస్టేట్

టాటా హౌసింగ్, టాటా రియాల్టీ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్,


- ఆటోమోటివ్

టాటా మోటార్స్,  (టాటా టెక్నాలజీస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, టాటా దేవూ, టాటా హిస్పానో, టాటా హిటాచీ కన్స్ట్ర్ స్ట్రక్షన్ మెషినరీ, టాటా మోటార్స్ కార్లు)


- టాటా ఆటో కాంప్ సిస్టమ్స్

టాటా ఇంటర్నేషనల్ వెహికల్ అప్లికేషన్స్


- కెమికల్స్

టాటా కెమికల్స్, (టాటా కెమికల్స్ యూరోప్, రాలిస్ ఇండియా లిమిటెడ్, బ్రిటిష్ సాల్ట్, మగాడి సోడా కంపెనీ, టాటా స్వచ్)


- రిటైల్ & ఈ-కామర్స్

టాటా డిజిటల్, (బిగ్ బాస్కెట్, టాటా 1ఎంజీ, టాటా న్యూ, టాటా క్లిక్, ఇన్పినిటీ రిటైల్, టాటా నెక్సార్క్), టైటాన్ కంపెనీ (టైటాన్, తనిష్క్, ఫాస్ట్ర్ ట్రాక్, వె్ట్ సైడ్, ట్రెంట్, తనీరా)


- ట్రేడింగ్ &ఇన్వెస్ట్ మెంట్స్

పనాటోన్ ఫిన్వెస్ట్


- వైద్య పరికరాలు

టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్

Tags:    

Similar News